గ్రామీణ యువతే గంజాయి ఎజెంట్లుగా మారుతున్న వైనం...!

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలంలో గంజాయి వినియోగం గ్రామీణ ఏజెంట్ల ద్వారా చాపకింద నీరులా విస్తరిస్తోంది.

పట్టణాలు, గ్రామాలు,తండాలు తేడా లేకుండా యువత,కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా దందా సాగుతుండగా బానిసైన యువత భవిష్యత్‌ అంధకారమవుతోంది.

యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని ఏజెంటు వ్యవస్థ అందినకాడికి దండుకుంటున్నారు.ట్రాలీ ఆటో,బైక్ లలో స్మగ్లర్లు యథేచ్ఛగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Rural Youth Are Turning Into Ganja Agents , Ganja Agents, Rural Youth, Pen Pahad

పెన్ పహాడ్ మండలం సింగిరెడ్దిపాలెం చెరువు కట్టమీద పోలీసుల దాడుల్లో మాచారం గ్రామానికి చెందిన గోపి అనే యువకుడి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకోవడం మండలంలో కలవరం కలిగిస్తోంది.మత్తు పదార్థాల వినియోగంపైౖ పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపితే పెన్ పహాడ్ మండలంలో పలు గ్రామాల్లో, తండాల్లో గంజాయి,మత్తు పదార్థాల సరఫరా చేస్తున్న ముఠాల గుట్టు రట్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దేశ్ ముఖ్ రాధిక
Advertisement

Latest Suryapet News