ప్రజా సమస్యలను పట్టించుకోని పాలకులు: తలారి శంకర్

నల్లగొండ జిల్లా:వర్షాభావ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం కోసం అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ( BRS, BJP ) పార్టీలు ఓట్ల కోసం ఒకరినొకరు తిట్టుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు,ధర్మ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు తలారి శంకర్ విమర్శించారు.

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ( Nagarjuna Sagar )లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రజలంతా నీరు మరియు ఇతర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారని,కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమై ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ప్రజా సమస్యలను గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్న పార్టీల నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా ప్రజలు అర్దం చేసుకోవాలని కోరారు.రాజకీయాలను పక్కనపెట్టి ఇకనైనా పాలకులు కళ్ళుతెరిచి గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యతో పాటు ఇతర ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఫేర్‌వెల్‌లో నవ్వుతూ మాట్లాడుతూనే కుప్పకూలిన స్టూడెంట్.. సెకన్లలో విషాదం.. లైవ్ వీడియో వైరల్!

Latest Nalgonda News