సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వైరల్ వీడియోలు రావడం గమనిస్తూనే ఉంటాం.ఇందులో కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే.
, మరికొన్ని వీడియోలు భయంకరంగా ఉండడమే కాకుండా ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలుగచేస్తాయి.ఇకపోతే తాజాగా ఇలాంటి ఆశ్చర్యకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూస్తే నిజంగా దేవుడా ఈరోజు మనదే.అని అనుకోకుండా ఉండం.
అంతలా ఈ వీడియో చూడటానికి భయంకరంగా ఉంది.ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇక ఈ వైరల్ వీడియో లో ఏముందో ఒకసారి చూస్తే.

ఈ వీడియోలోని సంఘటన ఇంగ్లాండ్ లోని( England ) లంకాషేర్ లోని విగాన్ లో( Wigan ) చోటుచేసుకుంది.వీడియోలో చూస్తున్న వారి ఇంటి బయట ఓ బాలిక పై భారీ క్రేన్( Huge Crane ) పడిపోతున్న సంఘటనలు వీడియోలో రికార్డు అయ్యాయి.మొదటగా ఓ బాలిక( Girl ) తన ఇంటి బయట సైకిల్ తొక్కుతూ కనపడుతుంది.
అయితే ఆదే సమయంలో ఇంటి బయట ఉన్న ఓ భారీ క్రేన్ బాలికపై పడిపోతుండగా రెప్పపాటు సమయంలో ఆ బాలిక అక్కడి నుంచి తప్పించుకుంది.ఈ సంఘటన మొత్తం రింగ్ డోర్ బెల్ కెమెరాలో రికార్డు కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సన్నివేశం సంబంధించి స్థానిక మీడియా కథనం ప్రకారం.బాలిక ఇంటి ముందు సైకిల్( Cycle ) తొక్కుతున్న సమయంలో., మరోవైపు ఇంటి బయట రోడ్డుపై ఉన్న భారీ కంటైనర్ ను క్రేన్ సహాయంతో పైకి లేపుతున్న సమయంలో ఇంటిముందు ఆడుతున్న బాలిక దాని గమనించి అప్రమత్తం అయ్యింది.జరగబోయే ప్రమాదం ముందుగానే పసిగట్టిన అమ్మాయి వెంటనే తన సైకిల్ పై నుండి లేచి ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది.
ఆ తర్వాత మరొక క్షణంలో క్రేన్ బోల్తా పడి ఇంటిముందు వరకు దూసుకు వచ్చింది.దాంతో కంటైనర్ ఇంటి పైకప్పును కూడా పగలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
దీన్ని చూసిన నెటిజెన్స్ నిజంగా బాలిక అదృష్టవంతురాలని కామెంట్ చేస్తున్నారు.







