కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లా:మోతె మండల( Mothey mandal ) కేంద్రంలోని జాతీయ రహదారి( National Highway )పై బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మృతి చెందగా,మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కి తరలించారు.

అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.

RTC Bus Rammed Into Workers' Auto, Three Killed, National Highway, Mothey Mandal

మునగాల మండలం విజయరాఘవాపురం,రేపాల గ్రామాలకు చెందిన మిరప కూలీలు మోతె మండలం బుర్కచర్లకు మిరపతోటకు వెళుతుండగా మోతె ఫ్లై ఓవర్ దగ్గర ఆటో రోడ్డు క్రాస్ చేస్తుండగా ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన ఆర్టీసి బస్సు( RTC Bus ) వేగంగా ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో విజయరాఘవాపురం( Vijaya raghawapuram ) గ్రామానికి చెందిన కందుల నాగమ్మ(65),చెవుల నారాయణమ్మ(68),రేపాలకు చెందిన పోకల అనసూయమ్మ (64) అక్కడిక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ సోమపంగు పవన్,కందుల గురవయ్య,నారగోని చంద్రమ్మ,బెల్లంకొండ స్రవంతి,పాలపాటి రాములమ్మ,పాలపాటి మంగమ్మ,కత్తి విజయ, సౌభాగ్య,సోమపంగు లక్ష్మి (రేపాల) తీవ్రంగా గాయపడ్డారు.

ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

Advertisement

Latest Suryapet News