ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో దాని నుంచి తమను తాము రక్షించుకోవడానికి, ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకునే పనిలో ఉన్నారు.రోగనిరోధక శక్తి పెరగడానికి పౌష్టికాహారంతో పాటు, పాలు పండ్లు కషాయాలు తాగడం అలవాటుగా చేసుకున్నారు.
మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల కరోనా బారిన పడకుండా, ఇతర వైరస్ల నుంచి మనల్ని కాపాడుకోవడానికి, ఆ వ్యాధికారక వైరస్ లతో పోరాడడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎంతో అవసరం.అయితే ఈ రోజ్ మొల్లేటి టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
రోజ్ మొల్లేటి సాధారణ వాడుక భాషలో మధురం చెట్టు అని కూడా పిలుస్తారు.ఇది ఎండిన చెట్టు యొక్క బెరుడు.
ఆయుర్వేద మూలికల దుకాణాలలో మనకు విరివిగా లభిస్తుంది.ఈ ముల్లేటిని సువాసన కారకంగా విస్తృతంగా వాడుతుంటారు.
ఇందులో ఉన్న యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జీవక్రియ చికిత్సకు ఎంతగానో ఉపయోగపడతాయి.అంతేకాకుండా ప్రేగు కదలికలను మెరుగు పరుస్తుంది.
రోజ్ ముల్లేటి బెరడును నమలడం గొంతునొప్పికి పాత నివారణ పద్ధతి.దగ్గు, బ్రోన్కైటిస్ వంటి సమస్యలను నయం చేయడంతోపాటు, దీర్ఘకాలిక ఉబ్బసం లక్షణాలను తగ్గించగలదు.
అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్దకాన్ని నివారించడంలో తో పాటు, గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
రోజ్ ముల్లేటి నీటిలో బాగా మరిగించి, ఆ నీటిని వడబోసి అందులో కొద్దిగా తేనె లేదా చక్కెర వేసుకుని రోజు ఉదయం ఈ టీ తాగడం వల్ల, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మొల్లేటి బెరుడు లో ఉన్న ఎంజైమ్స్ స్వయం ప్రతిరక్షక వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మ జీవులపై పోరాడి వాటి నుంచి వచ్చే వ్యాధుల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది.
చర్మ వ్యాధులను నయం చేసి, మెరుస్తున్న చర్మాన్ని పొందడానికి ఈ ముల్లేటి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
మీ చర్మం రకాన్ని బట్టి కొద్దిగా మొల్లేటి పౌడర్ తీసుకొని పాలలో లేదా రోజ్ వాటర్ లో కలిపి చర్మానికి అందించడం ద్వారా చర్మంపై ఏర్పడే పిగ్మెంటేషన్, తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా సహాయపడుతుంది.ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీర్ఘకాలికంగా బాధపడే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి, మన శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.