నరకానికి రహదారి...!

నల్లగొండ జిల్లా:దేవరకొండ మండల కేంద్రం నుండి తాటికోల్-గొల్లపల్లి( Thattikol-Gollapally ) తదితర ప్రాంతాలకు వేళ్ళే ప్రధాన రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది.

వర్షకాలంలో చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది.

ఇటీవల కురుస్తున్న వర్షాలకు వర్షాల ధాటికి తాటికోల్ రోడ్డు మొత్తం బురదమయమై ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.కనీసం పాదచారులు కూడా అడుగు తీసి అడుగు వేసే అవకాశం లేకపోవడంతో ఈ ప్రాంతాల ప్రజలు నరకం చూస్తున్నారు.

Road To Hell , Thattikol-Gollapally-నరకానికి రహదారి#

ఈ ప్రాంత ప్రజలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో దీనిపై ప్రయాణించాలంటే ప్రాణాల అరచేతిలో పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందని,ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు.ఇప్పటికైనా పాలకులు,అధికారులు స్పందించి ఈ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News