సూచిక బోర్డులు లేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

యాదాద్రి భువనగిరి జిల్లా:బొమ్మల రామారం మండలం( Bommalaramaram )లో రంగాపురం, రామలింగంపల్లి,తూంకుంట,ఖాజీపేట తదితర గ్రామీణ రహదారులు అనేక వంకర్లు తిరిగి ప్రమాదాలకు నిలయాలుగా మారాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

మూల మలుపుల దగ్గర ఎలాంటి సుచిక బోర్డులు లేక ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డేంజర్ జోన్లు( Danger zones )గా మారిన రహదారి మూలమాలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని,దీంతో ఈ రోడ్లపై ప్రయాణించే వారు నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుందని,ఈ మధ్య కాలంలో రామలింగంపల్లి( Ramalingampally ) వద్ద మూలమలుపులో డిసిఎం అదుపుతప్పి గోడను ఢీ కొట్టిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో గండం గటెక్కిందని అంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామీణ రహదారులపై మూల మలుపుల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

ఉర్సు ఉత్సవాలకు రండి -కేటీఆర్ కు ఆహ్వాన పత్రం

Latest Video Uploads News