పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తినే పండ్లలో ఆపిల్ ( Apple )ఒకటి.రోజుకు ఒక ఆపిల్ పండు తినడం వల్ల డాక్టర్ అవసరం ఉండదని చెబుతుంటారు.
ఎందుకంటే ఆపిల్ లో మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యాన్ని పెంచుతాయి.
అనేక జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.అయితే ఆపిల్ తినేటప్పుడు చాలా మంది తొక్క తొలగిస్తారు.
ఆపిల్ తొక్కలు ఎందుకు పనికిరావని డస్ట్ డబ్బింగ్ లోకి తోసేస్తుంటారు.కానీ నిజానికి ఆపిల్ తొక్క( Apple Peel )లో కూడా పోషకాలు ఉంటాయి.
అందువల్ల ఆపిల్ తొక్కలు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఆపిల్ తొక్కలు చాలా బాగా సహాయపడతాయి.ఆపిల్ తొక్కలో ప్రొసైనిడిన్ బి2 మరియు బయోటిన్ ఉంటాయి.ఈ సహజ సమ్మేళనాలు జుట్టు సమస్యలకు చికిత్స చేయడానికి మరియు జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి.
అలాగే జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే విటమిన్లు మరియు ఖనిజాలను ఆపిల్ తొక్క కలిగి ఉంటుంది.ఆపిల్ తొక్క జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.
మరి ఇంతకీ జుట్టుకు ఆపిల్ తొక్కలను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒకటి లేదా రెండు ఆపిల్స్ ను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఆపై పీల్ ను తొలగించాలి.ఉప్పునీటిలో కడగడం వల్ల ఆపిల్ తొక్కపై ఏమైనా రసాయనాలు ఉంటే తొలగిపోతాయి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో యాపిల్ తొక్కలు వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసే ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.ఈ హెయిర్ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.ఆపై షవర్ గ్యాప్ ధరించాలి.45 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఇలా చేశారంటే హెయిర్ ఫాల్ సమస్యకు శాశ్వతంగా బై బై చెప్పవచ్చు.అదే సమయంతో ఒత్తైన పొడవాటి ఆరోగ్యమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.