కోనో కార్పస్ టెర్రర్ ట్రీ లను తొలగించండి...!

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామ పల్లె ప్రకృతి వనంలో కోనో కార్పస్( Conocarpus ) చెట్లు సుమారు 40 అడుగుల ఎత్తు పెరిగి చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

ఈ పల్లె ప్రకృతి వనం సింగారం నుండి కోదాడ వెళ్ళే రోడ్డు పక్కన ఉండడంతో ప్రజలు ఈ చెట్ల గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతున్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం నాటిన కోనో కార్పస్ మొక్కలు విషాన్ని వెదజల్లుతూ మనవాళి మనుగడకు ప్రమాదకరంగా మారాయని విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో అటువైపు వెళ్ళాలంటే హడలిపోతున్నారు.అంతే కాకుండా రహదారి వెంట ఏపుగా పెరగడ వలన ఈదురు గాలులకు విరిగి బాటసారులు,వాహనదారులపై పడే అవకాశం ఉందంటున్నారు.

Remove Conocarpus Trees , Conocarpus , Conocarpus Trees , Anantha Giri, Surya

ఆకర్షణనీయంగా కనిపిస్తూ అతి త్వరగా ఎదగటం ఈ మొక్క యొక్క లక్షణం .ఈ మొక్కల ద్వారా పుప్పొడి రేణువులు ఏర్పడి,గాలిని కలుషితం చేయడంతో శ్వాసకోస వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయని,పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుందని,దీనితో మనుషులకే కాదు జంతు, క్రిమి,కీటకాల ప్రాణాలను కూడా హరిస్తుందని ప్రచారంలో ఉండడంతో గ్రామస్తులు ఈ మొక్కలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.

పచ్చని చెట్లు ఆక్సిజన్ ( Oxygenn )విడుదల చేయడంతో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని,కానీ,కోనో కార్పస్ మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తూ మానవాళికి ప్రమాదకరంగా మారాయని,వెంటనే గ్రామపంచాయతీ,వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సమన్యాయంతో ఈ మొక్కలను తొలగించి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే పూలు,పండ్ల మొక్కలు,వేప,సితాఫలం, వంటి మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యత రక్షించాలని గ్రామస్తుడు వెంకన్న,ఇతర ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Latest Suryapet News