ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని ధర్నా...!

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం అమలు చేస్తున్న రోస్టర్ లో దివ్యాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని జాతీయ వికలాంగుల వేదిక (ఎన్.పి.

ఆర్.డి) నేతలు అర్వపల్లి లింగయ్య,వీరబోయిన వెంకన్న( Veeraboina Venkanna) డిమాండ్ చేశారు.గురువారం ఎన్.పి.ఆర్.డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్( State and Subordinate Service Rules ) 1996 సవరించాలని, దివ్యాంగుల సాధికారత కోసం దివ్యాంగుల బంధు అమలు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇండ్లు, అంత్యోదయ కార్డులు జారీ చేసి,స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.రోస్టర్ 10 లోపు లేకపోవటం వలన నిరుద్యోగ దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందనిఆవేదన వ్యక్తం చేశారు.

తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు,వారి సహాయకులకు ప్రత్యేక అలవెన్సు చెల్లించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని,కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో కూడా ఈ విధానం అమలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు వి.యాదగిరి,కె.వెంకట్, ఎన్.కరుణాకర్, బి.సంతోష్,ఎన్.రాం కుమార్,వి.

వెంకటేశ్వర్లు, వి.నరేష్,డి.మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ
Advertisement

Latest Suryapet News