యానిమల్ సినిమా కనక హిందీ నుంచి జాతీయ అవార్డుల కమిటీ కి పంపిస్తే అందులో నటించిన రష్మిక ( Rashmika )నటన చూసి నిజాయితీగా, విభిన్నంగా అలోచించి మరి ఆమెకు ఉత్తమ నటి అవార్డు పక్క ఇవ్వాలి.ఆమె మన తెలుగు నుంచి వెళ్ళింది కాబట్టి మనం కోరుకుంటాం అన్నది మాత్రమే కాదు.
యానిమల్ సినిమాలో రష్మిక నటన కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది.పైగా ఈ సినిమాలో ఒక పక్క అనిల్ కపూర్( Anil Kapoor ) లాంటి ఒక సీనియర్ నటుడు, మరో పక్క గడ్డం తో, వొళ్ళంతా రక్తపు గాయాలతో, మత్తు లో ఉన్నట్టు కనిపించిన రణబీర్ కపూర్( Ranbir Kapoor ).ఈ ఇద్దరు ఉద్దండుల మధ్య ఆమె పోటీ పడి నటించడం మాములు విషయం కాదు.ఈ సినిమా లో ఏకంగా హీరోను రెండు సార్లు చెంప దెబ్బ కొట్టే సీన్స్ లో రష్మిక నటన ఎంతో మెచ్యూర్డ్ గా కనిపించింది.
ఆమె స్క్రీన్ పైన కనిపించిన ప్రతి సారి చూడముచ్చటగా ఉంది.ఈ చిత్రంలో రష్మిక కు కూడా నటన కు, వేరియేషన్స్ కి మంచి స్కోప్ దొరికింది.పెళ్లి కానీ యువతిగా మొదట కనిపించి, హీరోతో వివాహం అయ్యి ఇద్దరు పిల్లల తల్లిగా రష్మిక నటన అద్భుతం.పెద్దింటి కోడలు గా వెళ్లి, భర్త కోసం గీతాంజలిగా ఆమె ఆరాటం, ఆ ప్రేమ దొరక్క భర్త పరాయి స్త్రీ తో శృంగారం నెరిపాడని తెలిసి కోపావేశాలు కట్టలు తెచ్చుకునే భార్య పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించింది.
గీతాంజలి పాత్రకు చాల షేడ్స్ ఉన్నాయ్.పైగా మొదట ఈ సినిమా కోసం పరిణితి చోప్రాను తీసుకొని ఆమె లో ఇన్ని షేడ్స్ కనిపించక సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) రష్మిక ను తీసుకున్నాడు.
అతడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రష్మిక బాగా నటించి సందీప్ తో పాటు ప్రేక్షకులను మెప్పించింది.
తెలుగు లో ఇన్ని రోజుల పాటు ఆమె ఎన్నో సినిమాల్లో నటించిన కూడా ఇంత షేడ్స్ ఉన్న పాత్ర దొరకలేదు.విజయ్ దేవరకొండ ప్రభావం ఎక్కువగా ఉండేది.ఇంత పెద్ద నిడివి ఉన్న సినిమాలో ఆమె నటన మాత్రమే ప్రేక్షకుడికి కాస్త ఊరట.యూత్ కి ఎక్కువ రణబీర్ పాత్ర మత్తుగా ఎక్కిపోవచ్చు.అయన కనిపించిన ప్రతి సారి అర్జున్ రెడ్డి తో రిలేట్ చేసుకొని అరుపులు కేకలు థియేటర్స్ లో వేస్తున్నారు.
కానీ రస్మిక కూడా అతడిని డామినేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.పైగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎవరైనా నటిస్తారు కానీ ఇలాంటి నట దిగ్గాజలు ఉన్న సినిమాలో కూడా తనదైన తీరుగా మెప్పించడం అంటే నిజంగా హ్యాట్సాఫ్.
ఒకవేళ ఈ సినిమాతో జాతీయ అవార్డు దక్కకపోయినా భవిష్యత్తు లో అయినా తప్పక రావాలి.