అరుదైన గౌరవం సొంతం చేసుకున్న భారతీయ బీచ్లు..!

భారతీయ బీచ్లు అయిన తమిళనాడుకు చెందిన కోవలం మరియు పుదుచ్చేరి లోని ఈడెన్ బీచ్ లకు అరుదైన గౌరవం లభించింది.తాజగా ఈ బీచ్ లకు అంతర్జాతీయ పర్యావరణ స్థాయి ట్యాగ్ లభించింది.

 Rarely Respected Indian Beaches  Rare Record, Two Beaches, Indian Beaches, Blue-TeluguStop.com

ఈ మేరకు భారతదేశం లోని రెండు బీచ్ లకు బ్లూ ట్యాగ్ లభించడంతో ఇప్పుడు మొత్తం 10 బీచ్ లకు ట్యాగ్ లభించిందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారతదేశం లోని 10 అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉండగా, 2020 లో ట్యాగ్ పొందిన 8 బీచ్ లకు సర్టిఫికేషన్ లభించిందని అయితే ఈ ఏడాది కోవలం మరియు ఈడెన్ బీచ్ లు ఆ జాబితా లో చేరనున్నాయని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా దిశగా భారతదేశం ప్రయాణం చేస్తోందని, ఈ క్రమంలోనే మరో మైలు రాయి అందుకోవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణ లేబుల్ – బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను అందిస్తుంది.

భారత్ లో ఉన్న 8 బీచ్ లకు గత ఏడాది అక్టోబర్ 6న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది.అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ ల జాబితా లో శివరాజపూర్( ద్వారక – గుజరాత్), ఘోమ్లా (డయ్యు), పాడుబిద్రి ( కర్ణాటక), కప్పడ్ (కేరళ), రుషికొండ (ఆంధ్రప్రదేశ్), గోల్డెన్ బీచ్ ( పూరి- ఒడిశా), రాధానగర్ ( అండమాన్ నికోబార్ దీవులు) ఉన్నాయి.

Telugu Blue Flag Tag, Indian Beaches, Latest, Rare, Beaches-Latest News - Telugu

కాగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎకో- లేబుల్.పర్యావరణ, విద్య సమాచారం, స్నా నపు నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, రక్షణ, బీచ్ భద్రత, సేవలు అనే నాలుగు ప్రధాన విభాగాలలో 33 కఠినమైన ప్రమాణాల ఆధారంగా ఈ సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube