సమయపాలన పాటించని రామన్నపేట సబ్ రిజిస్ట్రార్

రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం వస్తూ నిత్యం పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం 9 గంటలకు రిజిస్టార్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన ప్రజలు మధ్యాహ్నం 12 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ రాకపోవడంతో ఎవరికీ చెప్పుకోవాలో అర్దం కావడం లేదని వాపోతున్నారు.

కార్యాలయ సిబ్బందిని అడగగా ఏదేదో కహానీలు చెబుతున్నారని,ఇక్కడ అన్ని పనులు కిందిస్థాయి సిబ్బంది కనుసన్నల్లోనే నడుస్తున్నాయని,సబ్ రిజిస్ట్రార్ ఇలా ఒక్క రోజు మాత్రమే కాదని,ప్రతీ రోజూ మధ్యాహ్నం అయితే కానీ,ఆఫీస్ రారని ఆరోపిస్తున్నారు.ప్రతిరోజు రిజిస్ట్రేషన్ కోసం రావడం సారు ఎప్పుడు వస్తారోనని కళ్ళు కాయలు కాసే వరకు ఎదురు చూడాల్సి వస్తుందని,ఇదేంటని సిబ్బందిని ప్రశ్నిస్తే సిబ్బంది సైతం సారువారికే వత్తాసు పలుకడం పరిపాటిగా మారిందని,సారు వారు హైదరాబాదు నుండి వచ్చే వరకు కిందిస్థాయి సిబ్బంది అన్ని రెడీ చేసి పెట్టాలని,అప్పుడు గాని సారు కుర్చీ ఎక్కరు,ప్రజల బాధ చూడరని అంటున్నారు.

Ramannapet Sub Registrar Who Does Not Follow Punctuality , Ramannapet Sub Regist

అనేక రకాల సమస్యలతో ఉండే ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు వస్తే ప్రతీ రోజూ మధ్యాహ్నం అయ్యేవరకు పట్టించుకునే నాథుడే లేక అవస్థలు పడుతున్నారని, ఇంత జరుగుతున్నా కనీసం ఈ కార్యాలయం వైపు కన్నెత్తి చూసేవారే లేరని,ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు రామన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దృష్టి సారించాలని, అధికారులు సమయ పాలన పాటించి,ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దేశ్ ముఖ్ రాధిక
Advertisement

Latest Suryapet News