నల్లగొండ జిల్లా:ఆటోలలో పరిమితికి మించి ఎక్కించడం ద్వారా ప్రమాదాలు జరిగి అనేక ప్రాణాలు గాల్లో కలుస్తున్నా,గాయాలపాలై అంగవైకల్యం వస్తున్నా ప్రజల్లో,ఆటో ఓనర్లు, డ్రైవర్లలో మార్పు రాకపోవడం బాధాకరం.కాసులకు కక్కుర్తిపడి ఆటో డ్రైవర్లు, కుటుంబాలు గడవక పనులు కోసం ప్రజలు, రవాణా ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పిల్లలను అధిక మొత్తంలో ఆటోలలో ఎక్కించడం, ఆటోలు అతివేగంగా వెళ్ళడం ద్వారా అధికంగా ఆటో ప్రమాదాలు జరుగుతున్నాయి.
రహదారి ఏదైనా ఆటోలలో ఎక్కేవారిది,నడిపేవారిది ఒకటే దారిగా మారింది.ఎక్కడ చూసినా ఒక్కో ఆటోలో 20 నుండి 25 మంది కూలీలు,పిల్లలు, ప్రయాణికులు కూడా ఆటోలలో ప్రయాణం చేయడం నిత్యం కనిపిస్తుంది.
ఈ పరిమితికి మించి ప్రయాణాలపై పోలీసులు అక్కడక్కడ చర్యలు చేపట్టినా పరిస్థితిలో మార్పు మాత్రం రావడం లేదు.నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో పరిమితికి మించి ప్రయాణికులతో వేగంగా వెళుతున్న ఆటోలపై ఎస్ఐ శోభన్ బాబు దృష్టి సారించారు.
ఇటీవల ఎక్కువ మందితో ప్రయాణించే ఆటోలను ఆపి కూలీలకు,డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.పనిలో కొన్ని ఆటోలను కూడా సీజ్ చేశారు.
అతివేగం,ఓవర్ లోడ్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు.పరిమితికి మించి ఆటోలలో ఎక్కడం,అతివేగంతో స్కూల్ పిల్లలను కూలీలను ఎక్కించుకొని అడ్డూ అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అతివేగంతో నడపడం, కూలి కోసం వెళ్లి మీ ప్రాణాలకు ఫణంగా పెట్టొద్దని,మీ పిల్లలను కూడా పరిమితికి మించి ఆటోలలో పంపవద్దని కౌన్సెలింగ్ ఇస్తున్నారు
.