ఐక్యత,ఆధ్యాత్మికతకు ప్రతిరూపం రంజాన్

సూర్యాపేట జిల్లా:గంగా జమున తెహజీబ్ లాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

మంగళవారం రంజాన్ పండుగ సందర్బంగా జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం సోదరులు,మత పెద్దలతో కలసి పండుగ నమాజ్ లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యదవ్ తో కలసి పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మైనార్టీల సమాజాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.మహమ్మద్ ప్రవక్తత బోధించిన మార్గాన్ని సుగమం చేస్తూ ప్రపంచ మానవాళి సంతోషంగా ఉండేలా కఠిన,ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు.

Ramadan Is The Epitome Of Unity And Spirituality-ఐక్యత,ఆధ్యా

తెలంగాణలో అన్ని వర్గాల ఆచారాలు,సంప్రదాయాలు గౌరవించే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని,ప్రభుత్వం తరపున పండుగను పురస్కరించుకుని రంజాన్ తోఫాలు,ఇఫ్తార్ కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందని, ఇఫ్తార్ కార్యక్రమాలు ఐక్యతకు నిదర్శoగా నిలుస్తాయని అన్నారు.జిల్లాలోని మైనార్టీ గురుకులలలో 2500 మంది విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని అన్నారు.అదేవిధంగా జిల్లాలో షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి ముస్లిం ఆడ పిల్లలకు ఇప్పటివరకు దాదాపు రూ.19 కోట్ల రూపాయల విలువ గల చెక్కులను అందించామన్నారు.క్రిస్మస్,రంజాన్,దసరా పండుగలు పేదల ఇండ్లలో సంతోషంగా జరగాలన్నది సీఎం కేసీఆర్ అభిమతమని,ఆదిశగా అన్ని కార్యక్రమాలను గొప్పగా చేపడుతున్నట్లు చెప్పారు.

దేశంలో అన్ని రాష్ట్రాలలో తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతుందని,దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా నిలుస్తుందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్,మున్సిపల్ చైర్పర్సన్ పి.అన్నపూర్ణ, జడ్పీటీసీ జీడీ భిక్షం,వార్డు కౌన్సిలర్లు,ముస్లిం సోదరులు,ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఎనిమిది మంది బెట్టింగ్ రాజాల అరెస్టు

Latest Suryapet News