అన్నింటికి సిద్దమంటోంది

వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్‌ లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.ఈ సినిమాపై రకుల్‌ చాలా ఆశలే పెట్టుకుంది.

 Rakul Preet Ready To Do Item Songs-TeluguStop.com

తన గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో నటించాను అంటోంది ఈ అమ్మడు.తాజాగా ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను రకుల్‌ చెప్పుకొచ్చింది.

‘సరైనోడు’ ప్రెస్‌మీట్‌లో రకుల్‌ మాట్లాడుతూ… తాను హీరోయిన్‌గా మాత్రమే కాకుండా ఐటెం సాంగ్స్‌లో నటించేందుకు కూడా సిద్దంగా ఉన్నాను అని, తనకు ఏవైనా ఒకే అంటూ చెప్పుకొచ్చింది.ఐటెం సాంగ్‌లతో తాను గ్లామర్‌ ఒలకబోసేందుకు సిద్దంగా ఉన్నాను అని, అయితే ఇప్పటి వరకు తనను ఐటెం సాంగ్స్‌ కోసం సంప్రదించిన వారు లేరు అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఈ అమ్మడు పాత్ర డిమాండ్‌ చేస్తే బికిని వేసేందుకు కూడా సై అంటోంది.గతంలో మోడల్‌గా ఉన్న సమయంలో బికినీ వేసుకున్న ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో వేసింది లేదు.

ఐటెం సాంగ్స్‌, లిప్‌లాక్‌, బికినీలకు సిద్దం అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ టాలీవుడ్‌లో మరింత క్రేజీ హీరోయిన్‌గా మారడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube