బాలీవుడ్‌లో బాహుబలి క్రేజ్‌కు ఇదే సాక్ష్యం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ కలెక్షన్స్‌ ప్రభంజనం సృష్టించిన విషయం తెల్సిందే.బాలీవుడ్‌ సినిమాల స్థాయిలో వసూళ్లను రాబట్టి హిందీ ఫిల్మ్‌ మేకర్స్‌కు కూడా షాక్‌ ఇచ్చింది.

 150 Crores For Baahubali 2 Hindi Version-TeluguStop.com

ఒక్క హిందీలోనే ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనాన్ని నమోదు చేసింది.ఒక డబ్బింగ్‌ సినిమా అంత మొత్తంలో వసూళ్లు చేయడం మామూలు విషయం కాదు.

హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను దక్కించుకున్న కరణ్‌ జోహార్‌కు కాసుల వర్షం కురిసింది.దాంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న రెండవ పార్ట్‌పై అందరి దృష్టి ఉంది.

ముఖ్యంగా బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఎప్పటికప్పుడు రెండవ పార్ట్‌ గురించి ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

మొదటి పార్ట్‌ వంద కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టడంతో రెండవ పార్ట్‌ బిజినెస్‌ అదిరి పోయే స్థాయిలో అవుతుందని అంతా ఊహించారు.

కాని ఊహకు అందని విధంగా ఈ చిత్రం బాలీవుడ్‌లో 150 కోట్ల బిజినెస్‌ చేయనున్నట్లుగా తెలుస్తోంది.బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని 150 కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఆర్కా మీడియాతో సదరు సంస్థ చర్చలు జరిపింది.అయితే ఆర్కా మీడియా మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.కరణ్‌ జోహార్‌తోనే ఆర్కా మీడియా బిజినెస్‌ ఒప్పందం చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.150 కోట్లు డబ్బింగ్‌ రైట్స్‌కు అంటే బాలీవుడ్‌లో బాహుబలికి ఏ స్థాయి క్రేజ్‌ ఉందో చెప్పకనే అర్థం అవుతోంది.వచ్చే ఏప్రిల్‌లో బాహుబలి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube