బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి గురించి స్పందించిన రకుల్ ప్రీత్.. అప్పుడే తొందర ఎందుకంటూ?

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్ సినిమా ‘ఛత్రీవాలీ’ చిత్రం షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్నారు.

 Rakul Preet Singh, Heroine, Tollywood, Marrige, Boy Friend,-TeluguStop.com

ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్ పాత్రల్లో కనిపించనున్నారు.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ లక్నోలో పూర్తి అయింది.

ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కాగ రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా ఈ ముద్దుగుమ్మకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.

గతంలో రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు ప్రొడ్యూసర్ జాకీ భగ్నానితో ఈమె ప్రేమలో ఉన్న విషయాన్ని వెల్లడించారు.ఈ క్రమంలోనే మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా అందుకు రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ ప్రస్తుతం ప్రేమ ప్రయాణంలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నానని, పెళ్లికి ఇప్పుడే ఎలాంటి తొందర లేదని వెల్లడించారు.

Telugu Boy Friend, Marrige, Tollywood-Movie

వివాహానికి కూడా సమయం రావాలని ఆ సమయం వచ్చినప్పుడు తన పెళ్లి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తానని ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి పై స్పందిస్తూ అసలు విషయం చెప్పారు.ఈమె చెప్పే మాటలు బట్టి చూస్తుంటే వీరిద్దరూ ఇప్పుడప్పుడే పెళ్లి పీటలు ఎక్కేలా లేరని తెలుస్తోంది.మరి ఈ జంటకు పెళ్లి సమయం ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.ఇకపోతే తెలుగులో కొండపొలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఈ సినిమా మంచి ఫలితాలను ఇవ్వలేకపోయిందని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube