పేట కాంగ్రేస్ లో రచ్చబండ చిచ్చు

రామిరెడ్డి దామోదర్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డిగా సాగుతున్న రచ్చబండ.రచ్చబండపై ఇప్పటికే పటేల్ రమేష్ రెడ్డికి షాకిచ్చిన డీసీసీ ప్రెసిడెంట్.

అయినా రచ్చబండలో దూసుకెళుతున్న పటేల్ రమేష్ రెడ్డి.నేటి రచ్చబండకు స్థానిక కౌన్సిలర్ కు సమాచారం ఇవ్వని పటేల్ రమేష్ రెడ్డి.

సమాచారం ఇవ్వకుండా తన వార్డులో రచ్చబండ ఎలా చేస్తారని కౌన్సిలర్ అసంతృప్తి.రచ్చబండ చేయొద్దని అడ్డుకున్న యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు.

సూర్యాపేట జిల్లా:రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ నిప్పు ఉప్పులా ఉంటున్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి,టీపీసీసీ అధికార ప్రతినిధి పటేల్ రమేష్ రెడ్డి వర్గ పొరుతో పేట కాంగ్రేస్ లో గందరగోళం ఏర్పడింది.ఇక ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం చేపట్టిన రచ్చబండ కార్యాక్రమం పేట కాంగ్రేస్ నాయకులకు,కార్యకర్తలకు పెద్ద తలనొప్పిగా మారిందని పార్టీ శ్రేణులు లోలోన మదనపడుతున్నారు.

Advertisement

ఇటీవల జిల్లా అధ్యక్షుడు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి అనుమతి లేకుండా రచ్చబండ నిర్వహించొద్దని డీసీసీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ బహిరంగంగా పటేల్ రమేష్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.అయినా డీసీసీ ఆదేశాలను భేఖాతార్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ను ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తా అంటూ మొండి పట్టుదలతో టిపిసిసి అధికార ప్రతినిధి పటేల్ రమేష్ రెడ్డి ముందుకు పోతున్నారు.

ఈ క్రమంలో గురువారం రాత్రి ఆయనకు పేట 8వ వార్డులో అనుకోని షాక్ తగిలింది.వార్డులో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి స్థానిక కాంగ్రేస్ కౌన్సిలర్ నెల్లుట్ల సోమలక్ష్మి,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు లింగుస్వామికి సమాచారం ఇవ్వలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పటేల్ రమేష్ రెడ్డిని అడ్డుకున్నారు.

కనీస సమాచారం లేకుండా ఎలా నిర్వహిస్తారని నిలదీశారు.అయితే మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి రచ్చబండ నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపధ్యంలో పటేల్ రమేష్ రెడ్డి వ్యవహారం పట్ల సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

పటేల్ రమేష్ రెడ్డి తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఇప్పటికే కాంగ్రెస్ వర్గ పొరుతో ఆందోళనగా ఉన్న కింది స్థాయి క్యాడర్ ఇద్దరు ఇలా విడివిడిగా రచ్చబండ కార్యాక్రమం నిర్వహించడంపై పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. ఎన్ని ఎకరాలంటే?

పేటలో కాంగ్రేస్ లో హస్తం పరిస్థితి ఇప్పుడు రాజకీయ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Latest Suryapet News