ఆ విష‌యంలో రేవంత్‌ను ఆద‌ర్శంగా తీసుకుంటున్న పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చిన సంగతి తెలిసిందే.

 Punjab Congress Chief Who Is Taking Rewanth As An Example In That Regard!, Revan-TeluguStop.com

ఈ క్రమంలోనే రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.కాగా, ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా నియమితులైన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు రేవంత్‌ను ఓ విషయంలో ఆదర్శంగా తీసుకుంటున్నారు.

అదేంటంటే.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం పట్ల కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేసిన సంగతి విదితమే.

కాగా, వారి సహకారం తీసుకునేందుకు గాను అందరిని ఇండివిడ్యువల్‌గా కలిసి వారు మద్దతు తీసుకునే ప్రయత్నం చేశారు రేవంత్.పంజాబ్ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయట.పీసీసీ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ నియామకం పట్ల సీనియర్లు విమర్శలు చేయగా, వారందరి వద్దకు వెళ్తున్నారు నవజ్యోత్.సీనియర్ నేతల ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు.

సీనియర్ల మద్దతుతోనే పార్టీ మరింత విస్తరించగలదని సిద్ధు చెప్తున్నారు.

Telugu Congress, Punjabcongress, Revanth, Trs-Telugu Political News

పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలుండగా పీసీసీ చీఫ్‌గా నవజ్యోత్‌ను అపాయింట్ చేసినట్లు సమాచారం.ప్రస్తుత పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, ఇతర సీనియర్ నేతల సహకారంతో కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌లో మరో సారి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నవజ్యోత్ సింగ్ సిద్ధు.సీనియర్లు సైతం మెల్లమెల్లగా నవజ్యోత్ సింగ్ నాయకత్వాన్ని బలపర్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా సీనియర్ల నుంచి యువనాయకత్వానికి దగ్గర్లో కాంగ్రెస్ పార్టీ చర్యలు కనిపిస్తున్నాయని చెప్పేందుకు తెలంగాణ, పంజాబ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌ల నియామకాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

అయితే, వీరిరువురు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడంలో సఫలమవుతారా? విఫలమవుతారా? అనే విషయం తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube