తుంగతుర్తిలో ప్రోటోకాల్ పంచాయితీ

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో అధికారులు వేసిన శిలాఫలకం ప్రొటోకాల్ పంచాయితీకి దారితీసింది.ఆదివారం12 కోట్లతో సంగెం నుండి నూతనకల్ వరకు సిఆర్ఆర్ నిధులతో బిటి రోడ్డు శంకుస్థాపన చేశారు.

అయితే శిలాఫలకంపై రాష్ట్ర మంత్రుల పేర్లు వేసిన అధికారులు రోడ్లు, భావనాలు మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు వేయలేదు.

అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మంత్రి పేరు మర్చిపోయారా,కావాలనే పెట్టలేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం జిల్లాలో ప్రొటోకాల్ రగడ చర్చనీయాంశంగా మారింది.

Protocol Panchayat In Tungathurthy, Minister Komatireddy Venkata Reddy, Suryapet

Latest Suryapet News