పసికందు మృతికి ప్రభుత్వ డాక్టర్లే కారణం:బాధిత కుటుంబం

నల్లగొండ జిల్లా:డాక్టర్ల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.మంగళవారం రాత్రి 11 గంటలకు సమయంలో ప్రసూతి కోసం వచ్చిన మర్రిచెట్టు తండాకు చెందిన మూడవత్ నందినికి ఆపరేషన్ చేయగా మగ శిశువు జన్మించింది.

 Government Doctors Are Responsible For The Death Of A Baby: Victim's Family, Gov-TeluguStop.com

శిశువు పరిస్థితి బాగాలేదంటూ హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.హైదరాబాద్ తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు.

అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బిడ్డ మరణించాడని,మృతి చెందిన తర్వాత తమకు సిరియస్ గా ఉంది హైదారాబాద్ తీసుకెళ్లాలని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.శిశువు మృతి చెందడానికి కారకులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube