మొక్కజొన్న పంటను( Maize Crop ) ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.మొక్కజొన్న పంట సాగుకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.
మొక్కజొన్న పంటను వరుసగా రెండు పంటలుగా వేయకూడదు.పంట మార్పిడి పద్ధతి కచ్చితంగా పాటించాలి.
మార్పిడి పద్ధతి వల్ల అధిక దిగుబడి రావడం, తెగుళ్లు( Pests ) సోకే అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.నీటి వనరులు పుష్కలంగా ఉంటే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందవచ్చు.
ఇకపోతే ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
రబీలో మొక్కజొన్న సాగు చేస్తే.
వేసవికాలంలో పంట చేతికి వస్తుంది కాబట్టి అంత నష్టం జరిగే అవకాశం ఉండదు.వివిధ రకాల తెగుళ్ల బెడద పెద్దగా ఉండదు.
మొక్కల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.
మొక్కజొన్న పంటకు కత్తెర పురుగుల( Scissor Worms ) బెడద కాస్త ఎక్కువ.ఈ పురుగులు పంటను ఆశిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.ఒకవేళ ఆలస్యం అయితే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.
అంటే ఈ పురుగులు చాలా తక్కువ వ్యవధిలో పంట మొత్తాన్ని ఆకులు లేని ఒక అస్తిపంజరం లాగా తయారు చేస్తాయి.
పురుగులను పొలంలో గుర్తించిన తర్వాత ఉదయం లేదా సాయంత్రం రసాయన పిచికారి మందులు ఉపయోగించి పూర్తిగా అరికట్టాలి.సేంద్రీయ పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే ఐదు మిల్లీలీటర్ల వేప నూనెను( Neem Oil ) ఒక లీటరు నీటిలో కలిపి మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే నాలుగు గ్రాముల ఇమమెక్టిమ్ బెంజోయేట్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.