నువ్వుల పంటలో చీడపీడల నివారణ.. అధిక దిగుబడి కోసం మెలుకువలు..!

నువ్వుల పంటను( Sesame ) ఖరీఫ్ పంటగా లేదా రెండవ పంటగా సాగు చేసి కొన్ని సంరక్షణ పద్ధతులు పాటిస్తే, తక్కువ వనరులతో అధిక దిగుబడి పొందవచ్చు.అయితే వేసవిలో సాగు చేస్తే చీడపీడల బెడద( Pest infestation ) కాస్త తక్కువగా ఉంటుంది.

 Prevention Of Pests In Sesame Crop Awakening For High Yield , High Yield ,sesame-TeluguStop.com

తెలుగు రాష్ట్రాలలో ఉండే నేలలు నువ్వుల పంట( Sesame crop ) సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కాకుండా తక్కువ మోతాదులో తేమ ఉండే తేలికైన నేలలు ఈ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి.

వేసవికాలంలో నేలను లోతుకు దుక్కి దున్ని చదును చేసుకోవాలి.ఎకరాకు 2.5 విత్తనాలు అవసరం అవుతాయి.కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరం, కాప్టాన్, మాంకోజెబ్ లతో విత్తన శుద్ధి చేసుకుని, విత్తనాలకు మూడు రెట్లు ఇసుక కలుపుకొని గొర్రు సహాయంతో విత్తు కోవాలి.

Telugu Agriculture, Yield, Latest Telugu, Pest, Sesame Crop-Latest News - Telugu

ఇక నువ్వుల పంటను ఆశించే చీడపీడలలో రసం పీల్చే పురుగులు మొక్కల ఆకులను ఆశించి, రసం పీల్చేయడంతో మొక్కలు ఎండిపోతాయి.ఈ రసం పీల్చే పురుగుల నివారణకు ఒక లీటర్ నీటిలో రెండు మిల్లీలీటర్ల మోనొక్రోటోఫాస్ కలిపి పిచికారి చేయాలి.తెల్లనల్లి పురుగులు పంటను ఆశించి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి ముడుచుకొని పాలిపోతాయి.వీటి నివారణకు లీడర్ నీటిలో ఐదు మిల్లీలీటర్ల డైకోఫాల్ కలిపి పిచికారి చేయాలి.

Telugu Agriculture, Yield, Latest Telugu, Pest, Sesame Crop-Latest News - Telugu

కాయతొలుచు పురుగులు మొక్కల ఆకులపై గూడు కట్టుకొని ఆకును తినడం ద్వారా తీవ్ర నష్టం కలుగుతుంది.ఈ పురుగులు ఎక్కువగా పూతకు వచ్చే సమయంలో, పిందెల సమయంలో లేత గింజలను తినేసి నష్టం కలిగిస్తాయి.వీటి తక్షణమే గుర్తించి లీటర్ నీటిలో 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ కలిపి పంటకు పిచికారి చేయాలి.బిహారి గొంగళి పురుగులు పత్రహారాన్ని పూర్తిగా తినేస్తాయి.ఇవి వీటి ఉధృతి పెంచుకొని మొగ్గలలో, పువ్వులలో, కాయలలో ఉండేలేత గింజలను అమాంతం తినేస్తాయి.వీటి నివారణకు లీటర్ నీటిలో రెండు మీటర్ల ఎండో సల్పాన్ కలిపి పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube