ఘోరం : గర్భిణీ పొట్ట మీదగా వెళ్లిన బస్సు.. 8 గంటలపాటు ప్రాణాలతో పోరాడి..

రోజూ ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.ఎన్నో కుటుంబాలు తమ అయిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగి పోతున్నారు.

 Pregnant Woman Died In Road Accident, Road Accident, Pregnant Woman, Died, Crime-TeluguStop.com

రోడ్డు ప్రమాదాల నుండి నివారణ కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.తాజాగా ముషీరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గర్భిణీ మృతి చెందడంతో ఈ విషయం తెలిసిన వారిని కలచివేస్తుంది.

కడుపుతో ఉందని తెలిసి భర్తతో కలిసి హాస్పిటల్ కు వెళ్లి చెకప్ చేయించుకుని మళ్ళీ బైక్ మీద తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో ఆమె మృత్యు వడిలోకి చేరుకుంది.ఆర్టీసీ బస్సు ఆ దంపతులను ఢీ కొట్టడంతో వారు అక్కడే పడిపోయారు.

అప్పుడు ఆమె మీద ఆర్టీసీ బస్సు చక్రాలు ఎక్కడంతో ఆమె 8 గంటలు మృత్యువుతో పోరాడి మరణించింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ముషీరాబాద్ బాకారంలో నివాసముండే సంతోష్, శాలినీ దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు.ఆమె మళ్ళీ గర్భవతి అయ్యిందని తెలిసి హాస్పిటల్ కు చెకప్ చేయించు కోవడానికి వెళ్లారు.

చెకప్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వారు బైక్ మీద ఇంటికి తిరిగి వెళ్తున్నారు.హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద సిగ్నల్ వచ్చాక మళ్ళీ బైక్ స్టార్ట్ చేస్తుండగానే ఒక బస్సు వాళ్ళు వెళ్తున్న బైక్ ను వెనుక నుండి ఢీ కొట్టింది.

బస్సు అలా ఢీ కొట్టగానే ఆ దంపతులు ఇద్దరూ పడిపోయారు.పడిపోయిన శాలినీ పొట్ట మీద నుండి బస్సు వెనుక చక్రాలు వెళ్లిపోవడంతో ఆమె పొట్ట భాగమంతా నుజ్జు నుజ్జు అయ్యింది.

ఆ సమయంలో అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఆమెకు ప్రాధమిక చికిత్స చేసి అంబులెన్స్ లో భార్య భర్తలను ఆసుపత్రికి తరలించాడు.ఈ ప్రమాదంలో సంతోష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

శాలినీ దాదాపు ఎనిమిది గంటలపాటు మృత్యువుతో పోరాడి చివరకు మరణించింది.ప్రస్తుతం సంతోష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వాళ్ళ ప్రమేయం ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో ఒక గర్భిణీ మృతి చెందడం పట్ల అందరూ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube