రాజకీయ ముదురు పీకే ! టీడీపీ తో డీల్ వెనుక ఆ పార్టీ ?  

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) ఏపీ రాజకీయాలను గజిబిజి చేసేశారు.2019 ఎన్నికల్లో టిడిపి ఓటమికి కారణమైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అదే టిడిపిని గెలిపించే బాధ్యతలను తీసుకోవడం పెద్ద కలకలం సృష్టిస్తోంది.రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనే సామెతను పీకే నిజం చేసేసారు.  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) తో కలిసి ఒకే విమానంలో, ఒకే వాహనంలో విజయవాడలోని ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు.

 Political Dark Pk! That Party Behind The Deal With Tdp , Prasanth Kishore, Pk,-TeluguStop.com

టిడిపి కోసం రాజకీయ వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.  అధికారకంగా దీనిపై త్వరలో ప్రకటన కూడా చేయబోతున్నారట .అయితే ఉన్నట్టుండి ప్రశాంత్ కిషోర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనేదానిపై వైసీపీ కూడా ఆరాతీస్తోంది.ఇక ఏపీ,  తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ప్రశాంత్ కిషోర్ నిర్ణయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

Telugu Ap, Jagan, Lokesh, Strategist, Prashantkishor, Rishi Raj Singh, Ysrcp-Pol

తెలంగాణలో కొంతకాలం క్రితం బీఆర్ఎస్ పార్టీ ( BRS party )కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేసినా,  తరువాత అక్కడ నుంచి తప్పుకున్నారు.  మళ్ళీ ఇప్పుడు ఊహించని విధంగా టిడిపి దగ్గరకు చేరారు. ప్రస్తుతం టిడిపి రాజకీయ వ్యూహకర్త గా  రాబిన్ శర్మ వ్యూహాలు అందిస్తున్నారు.ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నియామకంతో రాబిన్ శర్మను కొనసాగిస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

చాలా కాలంగా రాజకీయ పార్టీలకు వ్యూహాలు అందించే బాధ్యతల నుంచి ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నారు.ఐ ప్యాక్  నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.బీహార్ లో సొంతంగా పార్టీని స్థాపించి,  అక్కడ అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.పాదయాత్ర సైతం చేపట్టారు.

తాను ఐ ప్యాక్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని , పూర్తిగా బీహార్ రాజకీయాలలోనే ఉంటానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించినా,  ఇప్పుడు టిడిపి కోసం పని చేయడం వెనుక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.

Telugu Ap, Jagan, Lokesh, Strategist, Prashantkishor, Rishi Raj Singh, Ysrcp-Pol

 తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ నిర్ణయించుకోవడం వెనుక భారీగానే ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది .నారా లోకేష్( Nara Lokesh ), శంతను ( టీడీపీ కి అనుబంధంగా ఉన్న షో టైం కన్సల్టింగ్ లో ఆపరేషన్స్  హెడ్ ), కిలారు రాజేష్ లతో కలిసి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబునాయుడు ను కలిసేందుకు వచ్చారు.ప్రస్తుతం వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ఐ ప్యాక్ రిషిరాజ్ సింగ్ తో ప్రశాంత్ కిషోర్ కు విభేదాలు ఏర్పడ్డాయని,  దీంతో పాటు బీహార్ లో తన రాజకీయ పార్టీ కి భారీగా నిధుల  సమస్య ఏర్పడడంతోనే, టిడిపి తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది .అందుకే తాను బీహార్ లో నిర్వహిస్తున్న పాదయాత్రను సైతం నిలుపుదల చేసి టీడీపీ కోసం రంగంలోకి దిగారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube