పోలీస్ రివార్డ్ మేళా

సూర్యాపేట జిల్లా:జిల్లాలో పోలీస్ ఫంక్షనల్ వర్టికల్ విభాగాల పని తీరులో ప్రతిభ చూపిన సిబ్బందికి వారి పని తీరు సూచిక (kpi-key performance indicators) ఆధారంగా రివార్డ్ ప్రకటించడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పోలీస్ రివార్డ్ మేళా కార్యక్రమంలో సిబ్బందికి జిల్లా ఆయన కె.

పి.ఐ రివార్డ్స్ అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించడంలో, పోలీసు పనిలో నైపుణ్యం,ప్రతిభ చూపి బాగా పని చేసే సిబ్బందికి ఎల్లప్పుడు గుర్తింపు లభిస్తుందన్నారు.

పెట్రో కార్,బ్లూ కొట్స్,కోర్టు డ్యూటీ,కమ్యూనిటీ పోలీసింగ్,సెక్షన్ ఇంచార్జ్,రిసెప్షన్,పిటిషన్ మేనేజ్మెంట్,ఇన్వెస్టిగేషన్,స్టేషన్ నిర్వహణ,డయల్ 100 స్పందన ఇలా అన్ని విభాగాల్లో పోలీసు పనితీరులో,సేవలు అందించడంలో చాలా మార్పులు వచ్చాయని,ఎప్పటికప్పుడు నైపుణ్యంతో సేవలు అందించడంలో జిల్లా పోలీసు బాగా పని చేస్తుందని అన్నారు.ప్రతి సందర్భాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకుని ఉత్తమమైన సేవలను అందించాలని,పని తీరులో ఎప్పటికప్పుడు మెరుగైన ప్రదర్శన చేయాలని సిబ్బందికి సూచించారు.

సామర్ధ్యంతో పని చేయాలని, ప్రతి పనినీ మానిటరింగ్ చేయాలని అన్నారు.ఈ సమావేశంలో డిఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,సోంనారాయణ,డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ,సిఐలు విఠల్ రెడ్డి,ఆంజనేయులు, రాజేష్,నాగర్జున,మునగాల సిఐ ఆంజనేయులు, పి.ఎన్.డి ప్రసాద్,నర్సింహారావు,రామలింగారెడ్డి, ఐటీ కోర్,డీసీఆర్బీ ఎస్ఐలు,స్టేషన్ ఎస్ఐలు,సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

Latest Suryapet News