పెంపుడు జంతువులు ( Pets )ఒంటరితనాన్ని పోగొడతాయని అనడంలో సందేహం లేదు.అంతేకాదు బాధతో మునిగిపోయిన వారిలో కూడా సంతోషాన్ని తేగల సామర్థ్యం పెంపుడు జంతువులకు ఉంటుంది.
అవి పిల్లులు అయినా గానీ కుక్కలైనా గానీ యజమానులను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాయి.కుక్కలు ఎక్కువగా యజమాని దగ్గరే ఉంటూ వారికి తోడుగా నీడగా నిలుస్తాయి.
పిల్లులు కూడా అంతే ఉంటాయి.కాకపోతే ఇవి అప్పుడప్పుడు తమ ఆటిట్యూడ్ చూపిస్తుంటాయి.
పిల్లులు సాధారణంగా స్వార్థపూరితమైనవి, మూడీగా ఉంటాయి, మరోవైపు కుక్కలు మరింత విశ్వాసపాత్రంగా ఉంటాయి.వాటి యజమానులతో సమయాన్ని గడపడం ఆనందిస్తాయి.పిల్లులు మాత్రం తమకు ఇష్టమైతేనే యజమానితో గడుపుతాయి అలాగే యజమాని వద్దకు వస్తాయి.లేదంటే పిల్లులు యజమానులను అసలు లెక్కచేయవు.తామేరాజు తామే మంత్రిలా వ్యవహరిస్తాయి.కాగా ఒక వైరల్ వీడియోలో ఒక యజమాని తన పిల్లిని కౌగిలింత( Cat ) కోసం పిలిచాడు.
అయితే అది అతడి కౌగిలిలోకి వస్తున్నట్లే యాక్ట్ చేసి ఆ తర్వాత ముఖం చాటేసింది.దాంతో యజమాని తల పట్టుకున్నాడు.
<img src="https://telugustop.com/wp-content/uploads/2023/05/Pets-Cats-Dogs-Mood-Selfishness-Viral.jpg “/>
ఒక వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చి, తన పెంపుడు పిల్లిని కౌగిలించుకోవాలని కోరుకుంటాడు.ఆహ్లాదకరమైన స్వాగతం కోసం ఆశతో పిల్లిని తన వద్దకు పిలుస్తాడు.కానీ పిల్లి అతనిని పట్టించుకోకుండా వెళ్లి, యజమానిని నిరాశపరిచింది.ఈ ఫన్నీ క్లిప్ ట్విట్టర్లో ( Twitter,_షేర్ చేయబడింది.దీనికి 10 లక్షల వరకు వ్యూస్, 17 వేల లైక్లు వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటూ యజమాని పట్ల సానుభూతి చూపిస్తున్నారు.
మరి కొందరేమో “వీడియో తీసి హీరో అవుదామని అనుకున్నాడు పాపం జీరో అయ్యాడు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.