మిరప పంటలో చీడపీడల బెడద.. నివారణ కోసం సూచనలు..!

మిరప పంటకు(Chilli crop) చీడపీడల బెడద చాలా ఎక్కువ.మిరప పంటకు ఆశించిన స్థాయిలో ధరలు ఉన్న చీడ పీడల బెడదతో ఎప్పుడు రైతులు తీవ్ర నష్టాన్ని పొందుతున్నారు.

 Pests In Chilli Crop Suggestion For Prevention , Chilli Crop, Agriculture, Pests-TeluguStop.com

ముఖ్యంగా మిరప పంట పూతకు వస్తున్న సందర్భంలో తగిన సస్యరక్షణ పద్ధతులు పాటించి పంటని రక్షించుకోవాలి.మిరప పంట పూత దశలో ఉన్నప్పుడు పురుగులు ఎక్కువగా ఆశించి, పూత రాలిపోవడం, పిందెలు కాయలు గిడసబారి పోవడం విపరీతంగా ఉంటుంది.

పూతపై, మొగ్గలపై పురుగులు గుడ్లు పెట్టి పొదుగుతాయి.ఈ క్రమంలో లార్వాలు పూత లోపలికి చొచ్చుకు వెళ్లి తీవ్ర నష్టం కలిగిస్తాయి.

ఈ పురుగుల వల్ల పూత ముడుచుకొని ఉండడం, కాయలు వంకర టింకరగా పెరగడం, కాయలు గిడసబారి లోపల గింజలు లేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

మిరప పంట పూతకు వస్తున్న సమయంలో చెట్లపై ఈ పురుగుల ఆనవాళ్లను గమనించి వేప నూనె (Neem oil)1500 పిపిఎం 5 మిల్లీ లీటర్లను, పురుగుల ఉధృతిని బట్టి వారానికి రెండు లేదా మూడుసార్లు మొక్క పూర్తిగా తడిచే విధంగా పిచికారి చేయాలి.ఒకవేళ పురుగుల ఉధృతి లో తగ్గుదల కనిపించకపోతే ట్రజోఫాస్(Trazophos)రెండు మిల్లీలీటర్లు లేదా కొరాంట్రినిల్ ప్రోల్ 0.3(Corantrinyl prol) మిల్లీలీటర్లు పిచికారి చేస్తే పురుగులను అరికట్టవచ్చు.ముఖ్యంగా రైతులు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేలలో పంట మార్పిడి చాలా ముఖ్యం.ఇంకా పిచికారి మందులను ఎక్కువసార్లు వినియోగించకుండా మారుస్తూ ఉండాలి.పిచికారి మందులలో వేప నూనెను కలిపి పిచికారి చేస్తే పురుగుల ఉదృత్తిని పూర్తిగా అరికట్టవచ్చు.ఒకవేళ రైతులకు సరియైన అవగాహన లేకపోతే, వివిధ రకాల మందులతో ప్రయోగం చేయడం కన్నా వ్యవసాయ క్షేత్రం నిపుణుల సలహాలు తీసుకొని అవి సరైన రీతిలో పాటించడం ద్వారా పంటలో ఆశించిన స్థాయిలో దిగుబడి పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube