వైరల్: నీటిపై సునాయాసంగా నడిచేస్తున్న మహిళ.. దేవత అంటూ పూజలు చేస్తున్న వైనం!

సాధారణంగా మన జనాలకి సెంటిమెంట్స్ ఎక్కువ.ఎవరైనా భిన్నంగా ప్రవర్తిస్తే మనవాళ్ళు వారిని అయితే దెయ్యం పట్టిందని నిందిస్తారు, లేదంటే దైవ స్వరూపంగా భావిస్తూ పూజలు చేస్తుంటారు.ఇక్కడ రెండోది జరిగింది.అవును, తాజాగా ఓ మహిళకు ( Woman ) సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.నీటిపై నడుస్తున్న( Walkin On Water ) ఆ మహిళను చూసి స్థానిక ప్రజలు ఆమెను దేవత స్వరూపంగా భావిస్తూ పూజిస్తున్నారు.ఈ వార్త ఆ నోటా, ఈ నోటా పడి అందరికీ తెలియడంతో జనం తండోపతండాలుగా అక్కడికి తరలి వెళ్తున్నారు.

 People Worshipping Old Woman Walking On Water In Madhya Pradesh Details, Viral,-TeluguStop.com

వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్( Madhya Pradesh ) జబల్‌పూర్ జిల్లాలో స్థానికంగా ఉన్న నర్మదా నదిలోని తిల్వారా ఘాట్ వద్ద ఓ వృద్ధురాలు చేతిలో సంచి పట్టుకుని నీటిపై నడుస్తూ సునాయాసంగా అవతలి ఒడ్డుకి వెళ్ళిపోయింది.అలా నీటి పైనే చాలా దూరం అలా నడుస్తూ వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి చూసి ఇతరులకి కూడా చెప్పాడు.ఆ సమయంలో ఆమె పాదాలు తప్ప.శరీరం తడవకపోవడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.దాంతో ఆమె దేవతకు ప్రతిరూపం అంటూ కొందరు, నర్మదా దేవి.అంటూ మరికొందరు ఆమెకు పూజలు చేయడం మొదలుపెట్టారు.

ఇకపోతే దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.విచారణలో ఆ మహిళ.నర్మదాపురం ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల జ్యోతి బాయి అని తెలిసింది.10 నెలల క్రితం ఆమె తన ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు.ఎందుకంటే తన తల్లి మానసిక పరిస్థితి బాగోలేదంటూ మిస్సింగ్ రిపోర్టులో ఆమె కొడుకు పేర్కొన్నట్లు చెప్పుకొచ్చారు.ఇక నీటిపై నడిచిన ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.వృద్ధురాలు నడిచిన ప్రాంతంలో నీటి లోతు తక్కువగా ఉందని తేల్చి చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube