తుఫాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సూర్యాపేట జిల్లా:మిగ్ జామ్ తుఫాను ప్రభావం వల్ల సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు,రైతులు, వాహనదారులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ( Rahul Hegde ) సూచించారు.

మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు.

మిగ్ జామ్( Cyclone Michaung ) దృష్ట్యా సూర్యాపేట జిల్లా పోలీసు అధికారులను,సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి సేవలు అందించాలని సిబ్బందిని అదేశించారు.

People Should Be Alert In View Of The Cyclone Michaung , SP Rahul Hegde ,Surya

ఏదైనా అత్యవసరమైతే స్థానిక పోలీసులకు,డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు సేవలను పొందవచ్చని తెలిపారు.అధిక వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు శిథిలావస్థకు వచ్చిన నివాసలలో ఉండవద్దని,చేపల వేటకు వెళ్లొద్దు.

చెరువులు,వాగులు నిండుగా ఉన్నాయి కాబట్టి వాటి వద్దకు వెళ్ళవద్దు.వాతావరణ తడిగా ఉన్నందున కరెంట్ స్థంబాల వద్దకు వెళ్ళవద్దు.

Advertisement

సాధారణ ప్రజలు కరెంట్ రిపేర్ పనులు చేయవద్దు.వర్షం ప్రభావంతో చలి తీవ్రత ఉన్నందున పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రయాణ సమయంలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.రోడ్లపై వర్షం నీరు చేరడం వల్ల వాహనాలు అదుపుతప్పి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.

వాహనాలు వేగంగా నడపవద్దు.వర్షం పడే సమయంలో ప్రయాణాలు చేయకుండా వీలైతే వాయిదా వేసుకోవాలి.

జాతీయ రహదారి (ఎన్ హెచ్ 65) పై వాహనదారులు నెమ్మదిగా వెళ్ళాలి.వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు.

Advertisement

Latest Suryapet News