పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి: ములకలపల్లి రాములు

సూర్యాపేట జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కింద పనిచేసే కూలీలకు గత సంవత్సరం చేసిన పనికి వేతనాలు నేటికి విడుదల కాలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అన్నారు.

మంగళవారం మండలలోని తాడ్వాయి గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కూలీలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత సంవత్సరం పనిచేసిన సుమారు 2 నెలల వేతనాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంవత్సరంలో కూడా నాలుగు వారాలు అవుతున్నా పనులు వేగవంతంగా జరుగుతున్నా నేటికీ వేతనాలు అందడం లేదన్నారు.తీవ్రమైన ఎండలో కూలీలు కష్టపడి పని చేస్తున్నప్పటికీ వేతనాలు అందకపోవటం సరేంది కాదన్నారు.

Pending Wages Should Be Released Immediately Mulakalapalli Ramulu,Pending Wages

వేతనాలు సకాలం అందించడంలో,సౌకర్యాల అమలు జరపటంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోని ఉపాధి హామీ పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఆరే రామకృష్ణారెడ్డి,ఉపాధి హామీ మేట్లు నాగమ్మ, వెంకటమ్మ,వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News