సీఎం కేసీఆర్( CM KCR ) ఏప్రిల్ 30వ తారీకు హైదరాబాద్ నగర నడిబొడ్డున తెలంగాణ( Telangana ) కొత్త సచివాలయం ప్రారంభించడం తెలిసిందే.సచివాలయం ప్రారంభించిన అనంతరం తన చాంబర్ లో మొట్టమొదటిగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలుపై కేసీఆర్ తొలి సంతకం చేయడం జరిగింది.
ఆ తరువాత రైల్వే మార్గదర్శకాలు, పోడు భూములు ఇలా మొత్తం ఆరు ఫైళ్లపై కేసీఆర్ సంతకాలు చేశారు.అదే సమయంలో మంత్రివర్గం తమకు కేటాయించిన ఛాంబర్ లలో ఆసీనులయ్యారు.

ఇదిలా ఉంటే కొత్త సచివాలయంలో ఈనెల 18వ తారీఖున మొదటి కేబినెట్ భేటీ( Cabinet meeting ) నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది.ఈనెల 18న మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కొత్త సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.మరి ఈ క్యాబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆసక్తికరంగా మారింది.ఈ ఏడాదిలోను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూడోసారి జరగబోతున్న ఈ ఎన్నికలలో హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా కేసీఆర్ పార్టీ పదునైన వ్యూహాలతో సిద్ధమవుతోంది.ఇదే సమయంలో ప్రతిపక్షాలు సైతం.
విజయం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.







