పెంచికల్ దిన్నె పి.హెచ్.సి డాక్టర్ ముందే ఆగష్టు 15 కు హాజరైంది...?

సూర్యాపేట జిల్లా: ఆమె ఒక ప్రభుత్వ డాక్టర్, ప్రజలకు వైద్య సేవల అందించే వృత్తిలో ఉంటూ విధులకు డుమ్మా కొడుతూ,అటెండెన్స్ రిజిస్టర్ లో ఆగష్టు 15 ను ఒక రోజు ముందే జరిపిన్నట్లుగా సంతకం చేసి మధ్యాహ్నమే విధులను విస్మరించి వెళ్లిపోయిన ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సీతామహాలక్ష్మి బుధవారం మధ్యాహ్నమే విధులకు డుమ్మా కొట్టడమే కాకుండా గురువారం ఆగస్టు 15 న కూడా విధులకు హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్ళడంతో ప్రజలు మీడియాకు సమాచారం ఇచ్చారు.ఆసుపత్రికి మీడియా ప్రతినిధులు వెళ్లగా అప్పటికే డాక్టర్ ఆసుపత్రి నుండి వెళ్ళిపోయారు.

Penchikal Dinne PHC Doctor Attended 15th August Before , Penchikal Dinne, PHC Do

అంతేకాకుండా మరో ఇద్దరు సిబ్బంది బుధవారం గైర్హాజరు కావడంతో గురువారం కూడా గైర్హాజరు అయినట్లు రిజిస్టర్లో నమోదు చేయగా, మరొకరు బుధవారం విధులకు హాజరైనా ఆ రోజు,తెల్లారి కూడా రెండు రోజులు హాజరుకానట్లు రిజిస్టర్లో నమోదు చేయడం ఆశ్చర్యం కలిగించింది.ఇదే విషయమై ఫోన్లో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ డాక్టర్ గారు విధుల్లో చేరిన నాటి నుండి ఏదో ఒక సమస్యతో సిబ్బందిని, రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.గతంలో ఉన్నతాధికారుల నుండి షోకాస్ నోటీసు వచ్చినా ఆమె తీరు మారకపోవడం గమనార్హం.

Advertisement

అసలే నేరేడుచర్ల మండలంలో డెంగ్యూ జ్వరాలు ప్రబలి ప్రజలు అల్లడిపోతుంటే,ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవల గురించి పట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని,ఈ డాక్టర్ మాకొద్దంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దేశ్ ముఖ్ రాధిక
Advertisement

Latest Suryapet News