పొత్తులపై గట్టిగా ఇచ్చిపడేసిన పవన్ ! జన సైనికులకు అర్థమైందా ?

ఏపీ ఎన్నికల్లో కలిసి వెళ్లేందుకు టిడిపి,  జనసేన పార్టీలు( TDP Jana Sena parties ) పొత్తు పెట్టుకున్నాయి.అయితే ఈ పొత్తుపై రెండు పార్టీలు నేతల్లోనూ భిన్నభిప్రాయాలు ఉన్నాయి.

 Pawan Who Fought Hard On Alliances! Did The Soldiers Understand , Tdp, Janase-TeluguStop.com

ముఖ్యంగా జనసైనికులు టిడిపితో పొత్తు వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు .చావో రేవో ఒంటరిగానే తేల్చుకుందామని,  టిడిపి తో మాత్రం పొత్తువద్దని పదేపదే సోషల్ మీడియా వేదిక ద్వారా పవన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.కొంతమంది బహిరంగంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.ఇక టిడిపి,  జనసేన సమన్వయ కమిటీ సమావేశాల్లోనూ రెండు పార్టీల నేతలు కొట్టుకునే వరకు పరిస్థితి వచ్చింది.

తాజాగా ఈ వ్యవహారాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Telugu Ap, Janasena, Pavan Kalyan-Politics

‘ జనసేన, టిడిపి పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా, చిన్న కార్యకర్త మాట్లాడిన ఊరుకునేది లేదు.అలాంటి వారిని వైసిపి కోవర్టులుగా భావిస్తాం.గట్టి చర్యలు తీసుకుంటాం.ఈ నిర్ణయం నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే వైసీపీలోకి వెళ్లిపోవచ్చు ‘ అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు తూట్లు పొడిచినట్లు కాదు.  ఏ ప్రజల కోసం నిలబడాలనుకుంటున్నామో దానికి తూట్లు పొడిచినట్లు .అందుకే అలాంటి చర్యలను సహించను ‘ అంటూ పవన్ అన్నారు.అవివేకం తోనో, అజ్ఞానంతోనో ఈ పొత్తు నిర్ణయం తీసుకోలేదని పవన్ వ్యాఖ్యానించారు .గుంటూరు జిల్లా మంగళగిరిలో నిన్న నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన పవన్ టిడిపి,  జనసేన పొత్తు ఆవశ్యకత గురించి మాట్లాడారు.

Telugu Ap, Janasena, Pavan Kalyan-Politics

ఈ సందర్భంగా కొంతమంది జనసైనికులు టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంపై పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.‘ దశాబ్ద కాలం పాటు ఎవరున్నా లేకపోయినా,  పార్టీని నడిపిన వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మంచి జరిగేలా,  రాష్ట్రానికి మేలు చేసేలా, తెలుగు ప్రజలకు అండగా ఉండేలా నిర్ణయం తీసుకుంటాడని సంపూర్ణంగా నమ్మితే మీరు సందేహించరు.గొడవలు పెట్టుకోరు.  నన్ను ప్రధాని మోదీ,  జేపీ నడ్డా( JP Nadda ),చంద్రబాబు అర్థం చేసుకుంటారు .నేను పెంచి అండగా ఉన్న నాయకులు అర్థం చేసుకోరు.ఎక్కడుంది లోపం,  జాతీయస్థాయిలో నాకు ఉన్న దృష్టి మనవాళ్లకు ఎందుకు అర్థం కాదు.

మోదీ అంతటి వ్యక్తి అర్థం చేసుకుంటే , ఇక్కడ కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో ఎందుకు ఉంటారు .నా నిర్ణయాలను సందేహించేవారు వైసీపీలోకి వెళ్లిపోవచ్చు.పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా సీరియస్ గా తీసుకుంటాను.నేను మొండి వ్యక్తిని .భావజాలాన్ని నమ్మినవాడిని.రాజకీయాల్లో ఎవరు ఎవరిని బతిమాలరు ‘ అంటూ పవన్ జనసేనకులను ఉద్దేశించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube