ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీని( YCP ) ఓడించడమే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన పార్టీలు ( TDP Jana Sena parties )సరికొత్త కార్యచరణతో ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలనే లక్ష్యంతో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకు వెళ్లాలి అని నిర్ణయించుకున్నారు.ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేసి వైసీపీని ఢీకొట్టడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే టిడిపి తో పొత్తు పెట్టుకున్న పవన్ వైసీపీని ఓడించి ( Pawan Kalyan YCP )టిడిపి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పదేపదే చెబుతున్నారు.
ఈ మేరకు రెండు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.అలాగే సీట్ల సర్దుబాటు తో పాటు మరికొన్ని అంశాల పైన ఒక క్లారిటీకి వస్తున్నాయి.నిన్న తిరుపతిలో స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు నేడు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటున్నారు .ఇక పవన్ నిన్న మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా టిడిపి తో పొత్తు ఎంత అవసరమో పార్టీ శ్రేణులకు చెప్పారు.అంతేకాదు టిడిపితో పొత్తు అంశాన్ని వ్యతిరేకించే వారెవరు తనకు అవసరం లేదని, వారంతా వైసీపీలోకి వెళ్లిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు .ఇదిలా ఉంటే ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ప్రత్యేకంగా బేటి కాబోతున్నట్లు సమాచారం .
ఈ సందర్భంగా ఉమ్మడి కార్యాచరణతో ఏపీలో చేపట్టబోయే కార్యక్రమాలు, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.పవన్ చంద్రబాబు ( Pawan Chandrababu )భేటీకి సంబంధించి అధికారికంగా రెండు పార్టీల నుంచి సమాచారం ఏది బయటకు రాకపోయినా, వీరి భేటీ కావడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.దీంతో ఈ భేటీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.