Pawan Kalyan Sujith : పవన్, సుజిత్ సినిమా పోస్టర్ ని డీ కోడ్ చేస్తే ఏం అర్థం వస్తుందో తెలుసా?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతోంది అన్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

 Pawan Kalyan New Movie Poster Kept With Many Things , Pawan Kalyan , Sujith , Pa-TeluguStop.com

అయితే ఆ పోస్టర్ ని బట్టి చూస్తే అందులో దర్శకుడు సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం పవర్‌స్టార్‌ అభిమానులందరూ ఆ పోస్టర్‌లో దాగి ఉన్న విశేషాలను డీ కోడ్‌ చేసే పనిలో పడ్డారు.

ఈ క్రమంలోనే కొన్ని విషయాలను ఐడెంటిఫై చేశారు.

పోస్టర్ లో They Call Him #OG అని వుంది.

ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌.వాళ్లందరూ ఆయన్ని ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అని పిలుస్తుంటారని ఈ ట్యాగ్‌ లైన్‌ చెబుతోంది.అలాగె పోస్టర్‌లో పవన్‌కల్యాణ్‌ ఫొటోపై రాసి ఉన్న భాష.జపానీస్‌ అనగా అగ్నితుఫాన్‌ వస్తోంది అని అర్థం.పవన్‌కల్యాణ్‌ నీడలో గన్‌ కనిపిస్తుంది.పవన్‌ ముందు ఉన్న వృత్తాకారం జపాన్‌ జాతీయ జెండాను గుర్తు చేస్తోంది.అలాగే పోస్టర్‌లో ఒక వైపు విగ్రహం ఆకారం కనిపిస్తుంది.అది జపాన్‌ లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం.

ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో ఉంది.

Telugu Gangster, Pawan Kalyan, Pawankalyan, Pawan Poster, Sujith, Tollywood-Movi

పోస్టర్‌లో మరోవైపు చూస్తే మనదేశంలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా కనిపిస్తుంది.అలాగే ఈ సినిమా కథ జపాన్‌, ముంబయి నేపథ్యంలో సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై రూపుదిద్దుకోనున్న ఈసినిమాను దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కించబోటున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే పవర్ స్టార్ విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube