తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది.మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడ బోతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని జనసేన కూడా 8 స్థానాల్లో పోటీ చేసింది.దీంతో పూర్తిగా ఏపీ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.
టిడిపి , జనసేన( TDP Jana Sena ) లు కలిసి ఏపీలో ఉద్యమాలు, ప్రభుత్వ విధానాల పైన పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నాయి.ఇక టీడీపీతో పొత్తులో భాగంగా సీట్ల విషయంలోనూ క్లారిటీకి రావాలని పవన్ నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే కొన్ని స్థానాల విషయంలో చంద్రబాబు ను సైతం ఒప్పించారట.పొత్తులో భాగంగా జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలను కేటాయించేందుకు టిడిపి అంగీకరించినట్లు సమాచారం.
ఈనెల 2 లేదా మూడో తేదీన టిడిపి అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ( Chandrababu Pawan Kalyan ) భేటీ కానున్నారు.
ఈ భేటీలో సీట్ల విషయమే చర్చించి త్వరలోనే ఆ సీట్ల ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు పేర్కొన్నాయి .వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా చూడడమే లక్ష్యంగా టిడిపి, జనసేనలు పొత్తు పెట్టుకున్నాయి.తెలంగాణ ఫలితాలు తర్వాత బిజెపి వైఖరి ఏమిటనేది క్లారిటీ రాబోతోంది.
తమతో కలిసి బిజెపి కలిసి వస్తే సరే లేకపోతే తమ రెండు పార్టీలే కలిసి ఎన్నికలకు వెళ్లాలని పవన్ డిసైడ్ అయ్యారట.బిజెపి వైఖరి పై క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన చేయాలనే ఆలోచనతో ఉన్నారట.
జనసేనకు పొత్తులో భాగంగా టిడిపి మొదట 20 స్థానాలను మాత్రమే కేటాయించేందుకు పయత్నం చేసినా, గత కొద్దిరోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో, జనసేన గ్రాఫ్ పెరిగిన నేపథ్యంలో తమకు 50 సీట్లు అయినా ఇవ్వాలని జనసేన ప్రతిపాదించిందట.దీంతో 30 సీట్లకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణ , విశాఖ జిల్లాలో జనసేనకు ఎక్కువ స్థానాలను కేటాయించడంతో పాటు , కర్నూలు, గుంటూరు , ప్రకాశం జిల్లాలోనూ జనసేన సీట్లు ఆశిస్తూ ఉండడంతో, దానికి టిడిపి అంగీకారం తెలిపిందట .జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి మళ్లీ పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఇక మరో ఆప్షన్ గా తిరుపతి లేదా శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేసే విషయమై సర్వేలు జరుగుతున్నాయి.దీనిపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పవన్ రెండో స్థానం పైన క్లారిటీ రానుందిం జనసేనకు కేటాయించబోయే రెండు లోక్ సభ స్థానాల్లో ఒకటి కాకినాడ కాగా, రెండవది కర్నూలు లేదా నెల్లూరు లోక్ సభ స్థానాలను జనసేనకు కేటాయించబోతున్నట్లు సమాచారం.
కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాగబాబు అంత ఆసక్తి చూపించకపోయినా పవన్ ఒప్పించినట్లు సమాచారం.