పంచాయతీ కార్యదర్శుల వంటావార్పు...!

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు( Junior Panchayat Secretaries )రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

ముందుగా బోనం వండి ముత్యాలమ్మ అమ్మవారికి సమర్పించి తమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) మనసు మారేలా చూడాలని వేడుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రొహిబేషన్ కాలం ముగిసినా తమను క్రమబద్ధీకరించలేదని, జెపిఎస్ కార్యదర్శిలకు రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో సంవత్సరం శిక్షణ కాలాన్ని విధించి తర్వాత దాన్ని మూడేళ్లు పొడిగించిందని అన్నారు.ప్రస్తుతం నాలుగేళ్లు కావస్తున్నా రెగ్యులరైజ్ చెయ్యకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పు బట్టారు.

గ్రామాల అభివృద్ధిలో పంచాయితీ కార్యదర్శుల కృషి ఉందని,తక్షణమే పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ జెపిఎస్ లను ఓపిఎస్ లుగా చేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహిస్తాం : కలెక్టర్
Advertisement

Latest Suryapet News