బోయినపల్లి మండల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోవర్ధన్ గౌడ్ చిత్ర పటానికి పాలాభిషేకం.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్( Chidugu Govardhan ) చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.

రాజన్న సిరిసిల్ల జిల్లా లో గౌడ కులస్తులను ఏకం చేసి గౌడుల ఐక్యత, అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మా జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ని వ్యక్తిగతంగా సంఘం పరంగా పలచన చేయాలని అక్రమ కేసుల్లో ఇరికించి మచ్చ లేని మా గోవర్ధన్ ఒక మచ్చ చేయాలని కొన్ని వర్గాలు చూస్తున్నాయనీ, అందుకే ఈ రోజు మండల కేంద్రము లో మా జిల్లా అధ్యక్షుడి మీద ఎ మచ్చ ఉండకూడదని పాలాభిషేకం చేయడం జరిగింది .అలాగే ఇక ముందు కూడా గోవర్ధన్ మీద ఎలాంటి కుట్రలు చేసినా వాటిని మా గౌడ కులస్తులంధరం కలిసి కట్టుగా ఎదుర్కొంటామని తెలిపారు.చిదుగు గోవర్ధన్ గౌడ్ ను ఇలాగే జిల్లా గౌడ సంఘం ముందుకు తీసుకు పోవాలని మా బోయినపల్లి మండల గౌడ సంఘం తరపున కోరుకుంటున్నామనీ అన్నారు.

Palabhishekam Of Govardhan Gowda Image Under The Auspices Of Boinapally Mandal G

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పటీసీ పులి లక్ష్మిపతి గౌడ్, ఎంపిటిసి ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్,మండల గౌడ సంఘం అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీనివాస్ గౌడ్, మొరుపుల గంగాధర్ గౌడ్, నాగుల సాంబయ్య గౌడ్, బొంగాని శ్రీనివాస్ గౌడ్ , బండారి మహేందర్ గౌడ్, ఉయ్యాల తిరుపతి గౌడ్, నల్లగోండ శ్రీనివాస్ గౌడ్, బాలగోని ప్రశాంత్ గౌడ్, నేరెళ్ళ ఆంజనేయులు గౌడ్ చింతలకోటి పర్శరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!
Advertisement

Latest Rajanna Sircilla News