ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మద్దతు తీన్మార్ మల్లన్నకే:సీపీఎం

సూర్యాపేట జిల్లా:నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna )కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి( Mallu Lakshmi) అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నల్లగొండ, ఖమ్మం,వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని సీపీఎం రాష్ట్ర పార్టీ నిర్ణయించిందన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం,ఇండియా బ్లాక్ భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు.అదేవిధంగా ఇప్పుడు కూడా బీజేపీని ఓడించటం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నదని, పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని, మతోన్మాద బీజేపీ( BJP )ని ఓడించాలని సీపీఎం పిలుపునిస్తుందన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,మట్టిపల్లి సైదులు,కోట గోపి తదితరులు పాల్గొన్నారు.

Our Support In MLC Election Is Tinmar Mallannake: CPM-ఎమ్మెల్స�

Latest Suryapet News