ప్యారారం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఉస్మానియ వైద్యులు

యాదాద్రి భువనగిరి జిల్లా:బొమ్మలరామారం మండలం ప్యారారం( Pyararam ) గ్రామాన్ని ఉస్మానియా మెడికల్ ఆసుపత్రి వైద్యులు దత్తత తీసుకున్నారు.శనివారం 84 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులతో ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్స్ గ్రామాన్ని సందర్శించి 3 ఇండ్లకు ఒకరు చొప్పున గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు.

ఓపి విభాగంలో అందరినీ పరీక్షించి,మందులు పంపిణీ చేశారు.

ఈ విధంగా ప్రతి నెలలో 2వ, మరియు 4వ శనివారం 3 సంవత్సరాల పాటు దత్తత కింద పరీక్షలు చేస్తామని తెలిపారు.ప్యారారం గ్రామాన్ని ఉస్మానియా మెడికల్ స్టూడెంట్స్ దత్తత తీసుకున్నందుకు మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి,మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉస్మానియా హాస్పిటల్ ప్రొఫెసర్ నీలిమ,అసిస్టెంట్ ప్రొఫెసర్లు పావని,మనీజా, రితిక,శ్రీనివాస్,విద్యార్థులు పాల్గొన్నారు.

డిసెంబర్ 12 లోపు పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను సమర్పించాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
Advertisement

Latest Yadadri Bhuvanagiri News