జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంగా గత 23 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టు యలక సైదులుగౌడ్ పై కొందరు వ్యక్తులు దాడులు చేయడం చట్ట విరుద్ధమని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ కమిటీ సభ్యులు ముక్తకంఠంతో ఖండించారు.

సైదులుగౌడ్ పై దాడులు చేసిన వారి పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.జర్నలిస్టులు రాసిన వార్తల్లో వాస్తవం లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప భౌతికంగా దాడులకు దిగడం సరైన విధానం కాదన్నారు.

Ongoing Attacks On Journalists-జర్నలిస్టులపై జరు

జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌసుద్దీన్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ప్రచార సహాయ కార్యదర్శి దుర్గం బాలు,సూర్యాపేట జిల్లా ప్రచార కార్యదర్శి కొరివి సతీష్,సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు చిలుకల చిరంజీవి,నియోజకవర్గ కార్యదర్శి ధరావతు శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News