Smoking In ICU Ward : ఆసుపత్రి బెడ్‌పై పడుకొని షాకింగ్ పనిచేసిన ముసలావిడ.. వీడియో వైరల్..

కొంతమంది బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరి ఆగ్రహానికి గురవుతుంటారు.మరికొంతమందేమో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవ్వాలని ఏదో ఒక పని చేసి చివరకు ఇబ్బందుల్లో పడుతుంటారు.

 Old Woman Smoking In Icu Ward Of Bihar Patna Aiims Hospital Video Viral-TeluguStop.com

ఇంకొంతమంది తమ అలవాట్ల కారణంగా చిక్కుల్లో పడుతుంటారు.ఇలాంటి ఘటనలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

తాజాగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఓ వృద్ధురాలు( Old Woman ) చేసిన పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఆ వివరాలెంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, బీహార్ రాష్ట్రం పట్నాలోని ఎయిమ్స్( Patna AIIMS ) హాస్పిటల్ వార్డులో చాలా మంది రోగులు బెడ్లపై పడుకుని ఉన్నారు.వారితో పాటు ఓ వృద్ధురాలు కూడా బెడ్‌పై పడుకుని విశ్రాంతి తీసుకుంటుంది.ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు విషయం ఏంటంటే అప్పటివరకూ విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధురాలు ఒక్కసారిగా లేచి కూర్చుంది.కాసేపటికి తన వద్ద ఉన్న బీడీని( Beedi ) బయటికి తీసి వెలిగించి తాగడం మొదలుపెట్టింది.

బీడీ తాగుతున్న వృద్ధురాలిని చూసి ఆ వార్డ్ లో ఉన్నవరంతా షాక్ అయ్యారు.

కొందరు నవ్వుకుంటూ ఆమెను వీడియో తీస్తుంటే మరికొందరేమో ‘డాక్టర్‌ని పిలవండి’ అంటూ ఆ వృద్దురాలిని ఆటపట్టిస్తున్నారు.అయినా కూడా ఆ వృద్ధురాలు ఏమాత్రం భయపడకుండా బీడీ తాగుతూనే ఉంది.తరువాత కాసేపటికి బీడీని ఆర్పేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు .కొంతమందేమో ‘వామ్మో ఈ అవ్వ మామూలుగా లేదుగా’ అని కామెంట్స్ చేస్తే, మరికొంతమందేమో ‘ఇలాంటి అలవాట్లు అరోగ్యానికి ప్రమాదం’ అని అవ్వకు మంచి మాటలు చెప్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో 27వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube