సూర్యాపేట జిల్లా: జననీ జన్మ భూమిశ్చ.కనీ,పెంచీ,విద్యాబుద్ధులు నేర్పించిన దేశాన్ని వదిలి సప్త సముద్రాలూ దాటి పాశ్చాత్య దేశాల్లో నివసించారు.
అయినా కూడా పుట్టిన గడ్డపైనే మమకారం అంటున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ జలగం సుధీర్ కుమార్.చిన్నప్పటి నుంచే సమాజంలోని అనేక సమస్యలపై పోరాడుతూ ఆపదలో ఉన్నవారికి సహయం చేస్తూ,వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ, సమాజంలోని అన్యాయాలను ప్రశ్నిస్తూ, సమస్యలను ప్రభుత్వ అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తూ అవి పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తున్నారు.
రాజకీయాలు కేవలం ఎలక్షన్ ల సమయంలోనేనని మిగతా సమయం అంతా పార్టిలకతీతంగా ఇష్యుస్ మీద పని చేయాలనే ఆలోచనతో ఇష్యు బేస్డ్ పాలిటిక్స్ ప్రచారకర్తగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందాడు.కోదాడ ప్రాంతంలోని సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జలగం సుధీర్ కుమార్ తండ్రి పేరు రంగారావు.
చిన్నప్పుడే సమాజంపై అవగాహన పెంచుకుంటూ,చదువులో మొదటి స్థానంలో ఉండే సుధీర్‌కు ఉపన్యాస, వ్యాస రచన పోటీల్లో ఎప్పుడూ ప్రథమ బహుమతులు అందుకునే వారు.జె.ఎన్.టి.యులో ఎంబిఏ (కంప్యూటర్స్) పూర్తి చేసి అమెరికా, ఇండియా,కెనడా, ఇంగ్లాండ్ లలో పలు ప్రఖ్యాత కంపెనీలలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా,పలు ప్రాజెక్ట్ లకు మేనేజర్ గా చేశారు.ప్రస్తుతం ఎంఐటి అనే కంపెనీలో సీనియర్ కన్సల్టంట్ గా సియటెల్ సిటీలో పనిచేస్తున్నారు.
టెక్ మహింద్ర,పట్ని, కాగ్నిజంట్,ఎన్ టి టి, బ్రిటిష్ టెలికం,కాస్కొ, సుబరు మోటర్స్,మెర్క్ ఫార్మా మొదలైన కంపెనీల్లో సమర్థవంతమైన పనులు నిర్వహించారు.తను చేసిన కంపెనీల్లో అనేక సార్లు ఉత్తమ ఉద్యోగిగా గుర్తింపు పొందారు.
సమస్యలకు సవాల్ విసురుతూ ఈతరం యువ తరంగంలో ఒక కొత్త కెరటమై లేచాడు.సమాజంలోని సమస్యలకు సవాల్ విసురుతున్నాడు.
సాధించినదానికి సంతృప్తి పడిపోవడం లేదు.అతను అనుసరిస్తున్న మార్గం కొంచెం భిన్నమైనది.
మాతృభూమికి ఏదో సేవ చేయాలన్న తపనతో దానిని నిజం చేయడానికి నిరంతరమైన ఆలోచనలతో తపస్సు చేస్తున్నాడు.అలుపెరగని శ్రమ.
శ్రమించనిదే ఆలోచనకు వాస్తవరూపం రాదని,ఆలోచనకు ప్రశ్నే పునాదని నమ్ముతున్నాడు.ఎక్కడో విదేశాలలో జీవనం సాగించి కొన్నెండ్ల తర్వాత తిరిగొచ్చి పుట్టిన గడ్డ కోసం సేవలు అందిస్తూ శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించే యత్నం చేస్తున్నాడు జలగం సుధీర్ కుమార్.
తన మాతృగడ్డకు ఏదైన సమస్య ఎదురైతే సుధీర్ నిద్రపోడు.ఆ సమస్యకు సవాల్ విసురుతాడు.
తను నివసించిన అమెరికా నుంచే సమస్యపై యుద్ధం మొదలుపెట్టాడు.సుమారు 250 కోట్ల విలువైన కోదాడ పెద్ద చెరువు భూమిని కాపాడటం కోసం సంవత్సరం కష్టపడి అమెరికా నుంచే వివిధ మార్గాల్లో 300 పైగా పేజీల కబ్జాల వివరాలు సేకరించి మంత్రి హరిష్ రావు అందజేసి,మిని ట్యాంక్ బండ్ సాదించడానికి కృషి చేశాడు సుధీర్.
సుమారు 180 వరకు ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలలో అనేక మార్పుల విషయంలో పత్రికాముఖంగా,ప్రత్యేక లేఖ ద్వారా ముఖ్యమంత్రికి సూచనలు అందించారు.అంతేకాదు నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్దుల విషయంలో సొంత ఖర్చులతో సామాజిక స్పృహ కోసం పాటలు రాయించి ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీతో విడుదల చేయించారు.
చిన్నారుల విద్య కోసం ప్రభుత్వ బడుల నిర్వహణ, సొంతంగా ఆదాయ వనరుల సమీకరణ దిశగా విద్యా శాఖకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి విలువైన సూచనలు అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు.అమెరికాలో చదువుకుంటున్న సుధీర్ పెద్ద కుమారుడు వేదాన్ష్‌ను స్వరాష్ట్రమైన తెలంగాణలోని సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కొన్ని రోజులు చదివించాడు.
కొంతకాలం గ్రామీణ వాతావరణం, వివిధ సామాజికవర్గాల వృత్తులను వేదాన్ష్‌కు పరిచయం చేశారు సుధీర్.దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు,స్థానికులకు కొంత ఉత్సాహం నింపినట్టయింది.
అమెరికాలోని కాఫి విత్ ప్రిన్సిపాల్ కార్యక్రమం ఇక్కడ తెలంగాణలోని 280 కి పైగా బి.సి.వెల్ఫేర్ బడుల్లో జరుపుకునేల చొరవ తీసుకొని ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించాడు.ప్రభుత్వ బడుల్లో చేసిన కార్యక్రమాలకు టీచర్ వారియర్ అవార్డుతో సత్కరించబడ్డాడు.
ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు యువనేత కేటీఆర్ ఆశిస్సులతో ప్రభుత్వం కార్యక్రమాలు ప్రజల్లో ప్రచారం చేస్తునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ కార్యక్రమాల అంశాల మీద 5000 కి పైగా ఆర్టిఐ అప్లికేషన్ ల ద్వారా సమాచారం సేకరించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల పనితీరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చినాడు సుధీర్.నిర్భయ ఫండ్స్ వినియోగం,ప్రజా ప్రతినిధుల విదేశి ఖర్చులు,సాయిల్ టెస్టింగ్, సీడ్ డెవలప్ మెంట్, వివిధ మునిసిపాలిటిల్లో ఖర్చుల దుర్వినియొగం, హరితహారంలో మొక్కల వివరాలు,ప్రభుత్వ భూముల వివరాలు లాంటి అనేక ఆంశాల మీద ఆర్టిఐ ద్వారా అధికారుల్లో కదలిక తీసుకొచ్చి నిధులు దుర్వినియొగం కాకుండా చూసాడు.
ఫ్లెక్సీలు రసాయనిక పదార్థాల వస్తువు కాబట్టి పర్యావరణాన్ని పాడుచేసే గుణం చాలా ఎక్కువ ఉంటుంది.
ఒక్క కోదాడ పట్టణంలోనే సుమారు లక్ష వరకు ఫ్లెక్సీలు కనిపించడం సుధీర్‌ను కలిచివేసింది.ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ని కలిసి ఈ సమస్యపై కంప్లైంట్ చేశాడు సుధీర్.
అంతేకాదు ఫ్లెక్సీల వలన వచ్చే చెడు ప్రభావాలపై కోదాడలోని జర్నలిస్టులకు వివరించి ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చి వారిని కూడా భాగస్వామ్యం చేశారు.
ఉమ్మడి నల్లగొండలో తీవ్రంగా ఉన్న ఫ్లోరొసిస్ సమస్య, మిషన్ కాకతీయ, మిషన్ భగిరథ ద్వారా కొంతవరకు రూపుమాపే ప్రయత్నం జరుగుతున్నా ఇప్పటికే ఆ వ్యాధితో భాదపడుతున్న సుమారు 2 లక్షల మందికి ఒక ప్రత్యేక కార్పొరెషన్ కోసం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయటం జరిగింది.ఫ్లోరొసిస్ ప్రభావిత ప్రాంతాలు పర్యటించి వారిలో ఆత్మవిశ్వాసం నింపి,వారిలో నైపుణ్యం కలవారికి తొడ్పాటు అందించి ప్రపంచానికి వారిని పరిచయం చేయటం జరుగుతుంది.
కనీసం 2 సెంటిమీటర్లు కూడా చేతిని కదల్చలేని సువర్ణ అనే ఫ్లోరొసిస్ భాదితురాలు వేసిన పెయింటింగ్స్ ఫేస్ బుక్ ద్వార వేలం వేయగా సుమారు 6,00,000/ - సమకూరాయి.ఈమె వేసిన బొమ్మలను కేటీఆర్ స్వయంగా మెచ్చుకోవటంతో పాటు అవసరమైన సహయం చేస్తానని హామి ఇచ్చాడు.
కవిత కల్వకుట్ల జాగృతి సంస్థ ద్వారా 1,00,000/- పంపించారు.పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్ర స్వయంగా ట్విట్టర్ ద్వార అభినందించటం విశేషం.
అంసాల స్వామికి ప్రభుత్వం నుండి డబుల్ బెడ్రూం ఇల్లు,సెలూన్ షాప్ మంజూర్ చేయించి ఉపాధి కల్పించాడు.
చేతులకు,కాళ్ళకు చిన్న చిన్న గాయాలయితేనే మనం ప్రథమచికిత్స కోసం ఆరాటపడుతుంటాం.అట్లాంటిది మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం మోహం/తల.
దీని మీద చిన్న మొటిమైన మనం ఎంతో అందవికారంగా కనపడుతామని భాదపడుతాం.అట్లాంటి ముఖ్యమైన మొహాన్ని ఏ మాత్రం పరిశుభ్రమైన పద్దతులు పాటించని, అనుమతుల్లేని కెమికల్స్ కలిపిన పౌడర్లు/ శాంపులు/షేవింగ్ లోషన్లు వాడుతున్న ఒక సెలూన్ లోని వ్యక్తిని గుడ్డిగా నమ్మాల్సి వస్తుంది.
ఇక్కడే జలగం సుధీర్ కి ఒక ఆలోచన వచ్చింది.వచ్చిందే తడవుగా మార్కెట్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్లు కొని,ప్రముఖ డాక్టర్ల సహకారంతో మొట్టమొదటి సారిగా ఆనంతగిరి మండలంలోని వాయిల సింగారంలోని నాయి బ్రహ్మణులకు, సెలూన్ షాపు వారికి ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందచేశారు.
ఇప్పటివరకు 200 సెలూన్ కిట్లను పంచి చేనెత వారికి ఉపాధి లభించేలా వారి ఉత్పత్తులతో కలిపి సెలూన్ కిట్లను ప్రతి షాపుకు అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
నిత్యం జరుగుతున్న రోడ్డు యాక్సిడెంట్ లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తెలంగాణలో 28 ట్రౌమా కేర్ సెంటర్ లు ప్రకటించటంలో తనదైన పాత్ర పోషించాడు.సామాన్యుడికి లబ్ది చేకూరేలా ప్రతి టోల్ గేట్ రిసిప్ట్ తో ప్రతి మనిషికి 10 లక్షల రుపాయల భీమా సౌకర్యం ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే త్వరలో దాని మీద నిర్ణయం తీసుకుంటామని రహదారులు మరియు హైవేల శాఖ తెలిపింది.
తన మాతృగడ్డ ఆరోగ్యకరంగా కనిపించాలని తపన పడే సుధీర్,ప్రభుత్వం మీద భారం లేకుండా తనకున్న ఖాళీ ప్లాట్లను,స్థలాలను శుభ్రం చేయించి హరితహారం కింద చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాడు.చిన్నపిల్లలకు తాత్కాలిక ఆట స్థలం, వృద్దులకు కూర్చునే బల్లలు ఏర్పాటు చేయించారు.
సుధీర్ నిరంతరం ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.గురుకులంలో చదువుకునే విద్యార్దులకు ఉపకార వేతనం,బంగారు పతకాలు అందజేశారు.
అమెరికాలో చనిపోయిన కుటుంబాలకు సహాయం చేశారు.వరద బాధితులకు సహాయక కార్యక్రమాలు చేశారు.
అంతేకాదు 1999 లో జరిగిన కార్గిల్ యుద్ద సమయాన విరాళాల సేకరించారు.వారి కుటుంబాలకు సహయంగా కార్యక్రమాలు నిర్వహించారు.
వృద్దులకు ఆర్దిక సహయం, విద్యార్దులకు ఫీజులు, ఆనారోగ్యంగా ఉన్న కొంతమంది బంధుమిత్రుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం,ఆసుపత్రి బిల్లులు చెల్లించారు.తెలంగాణ సమాజం కోసం పాటుపడుతున్న రచయితలన్నా,కవులన్నా సుధీర్‌కు ఎంతో అభిమానం.
అందెశ్రీ, దేశపతి శ్రీనివాస్, రసమయి లాంటి కళాకారులతో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు సుధీర్.తెలంగాణను అవినీతి రహిత సమాజం చేసేందుకు స్వయం సేవక సంఘాలతో కలిసి పని చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో సుధీర్ తనదైన పోరాటం సాగించారు.
ఆ సమయంలో ఉద్యమంలో చురుకుగా పాల్గొనవల్సిందిగా ఎంపీ, ఎంఎల్ఏ,సర్పంచ్ లాంటి ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు.ఎప్పటికప్పుడు ఫోన్ లు చేస్తూ వారిని ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రయత్నించారు.2009-11 సమయంలో తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు మానవహారం,రాస్తారోకొ, వంటవార్పు, విద్యావంతుల సెమినార్లలో సుధీర్ చురుకుగా పాల్గొన్నారు.అంతేకాదు తెలంగాణ జేఏసీ ఏర్పాటు నుంచి తెలంగాణ వచ్చే వరకు అన్ని కార్యక్రమల్లోనూ ఆయన వాలంటీర్ గా పాల్గొన్నారు.
అంతేకాదు ప్రవాసి తెలంగాణ దివస్ ల ద్వారా ఎన్ఆర్ఐ ల ములఖాత్,ఆపద సమయాల్లో ఎన్ఆర్ఐ లకు సహాయం చేశారు.అనేక దేశాల్లోని తెలంగాణ సంఘాల వారికి వాలంటీర్ గా చేశారు.
ప్రవాస గొంతుక అనే కార్యక్రమం ద్వారా ప్రవాస భారతీయుల ఆలోచనలను,సలహాలను,ఫిర్యాదులను ప్రభుత్వానికి చేర్చుతున్నారు.మహిళలు,విద్యార్దినులపై భారత్ లో జరిగిన అనేక హింసాత్మక ఘటనలపై క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు.
మిషన్ కాకతియ నిధుల విషయంలో కొంతమంది ప్రవాసుల ఫేక్ డొనేషన్స్ పై మంత్రికి ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం చేశారు.సుధీర్ ఆలోచనలన్నీ పుట్టిన గడ్డపైనే ఉంటాయి.
అన్ని వర్గాల గురించి ఆలోచిస్తాడు.వ్యవసాయంలో సరికొత్త టెక్నాలజీ మార్పులను తీసుకువచ్చి రైతులను ఆదుకోవాలని భావిస్తాడు.
అందుకనుగుణంగా పథకాలను రూపొందిస్తున్నారు సుధీర్.ప్రపంచ మార్కెట్‌లోకి సామాన్య రైతు కూడా తన వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా అందిస్తే రైతు సంతోషంగా ఉంటాడని భావిస్తున్న సుధీర్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.
అంతేకాదు విద్యార్దులకు నైతిక విలువలు పెంచటం కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని తపిస్తున్నాడు.యువత రాజకీయాల్లోకి కూడా వచ్చేలా కృషి చేస్తూ మనిషికి,మనిషిలోని మానవత్వానికి,సేవా తత్పరతకు,విలువలు కలిగిన నవీన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు జలగం సుధీర్ కుమార్.!.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy