గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా డాటర్ కొనిదెల నిహారిక( Niharika Konidela ) పేరు మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.తరచూ ఏదో ఒక విషయంతో నిహారిక పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.
కాగా నిహారిక జొన్నలగడ్డ చైతన్యను( Chaitanya Jonnalagadda ) పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే ఇటీవలే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో కావడంతో పాటు పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ ఖాతాల నుంచి డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
వీరిద్దరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని అందుకే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై నిహారిక ఫ్యామిలీ కానీ అటు చైతన్య ఫ్యామిలీ కానీ ఇంతవరకు స్పందించడం లేదు.అలాగే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం గురించి స్పందించే నాగబాబు ( Nagababu ) తన కూతురి విడాకుల విషయంపై అసలు స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమే అని చాలామంది విశ్వసిస్తున్నారు.
ఎందుకంటె ఆ వార్తలను ఖండిస్తూ ప్రకటన చేయలేదు.బహిరంగంగా ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు.
ఇది పూర్తిగా నిహారిక వ్యక్తిగత విషయం కాబట్టి మీడియా గోప్యతను పాటించడం కూడా అవసరం.ఇది ఇలా ఉంది చాలా గ్యాప్ తర్వాత నిహారిక నటించిన తాజా వెబ్ సిరీస్ డెడ్ పిక్సెల్స్.( Dead Pixels ) ఈ వెబ్ సిరీస్ మే 19వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ఇప్పటికే ఇది ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.
ఈ సిరీస్ లో గాయత్రి అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఒక ప్రశ్న ఎదురయ్యింది.
మీరు మీ భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజా నిజాలు ఏంటి అని నిహారికను ప్రశ్నించగా.ఆ ప్రశ్నలకు సమాధానమివ్వకుండా దాటవేయడం గుసగుసలకు మరింత తావిచ్చింది.భర్త చైతన్య జొన్నలగడ్డతో విభేదాలపై ప్రశ్నకు నిహారిక ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.అలాగని దానిని ఖండించనూ లేదు.వైవాహిక స్థితిపై నిహారిక పూర్తిగా మౌనం వహించింది.దీంతో ఈ విషయంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారేమో అందుకే నిహారిక స్పందించలేదు.విడాకులు తీసుకోకపోతే అదే విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేది కదా అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.