టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.రాజకీయ ఉనికి కోసమే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు.
చంద్రబాబుకు బీసీలు, కాపులు నచ్చరని తెలిపారు.చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాడేపల్లి సీఎం కార్యాలయంను ముట్టడించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు.టీడీపీ హయాంలో రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరమని స్పష్టం చేశారు.