నేటి నుంచి దేశంలో కొత్త చట్టాలు...!

నల్లగొండ జిల్లా:దేశంలో నేటి నుంచి మూడు కొత్త న్యాయ చట్టాలు అమలులోకి రానున్నాయి.

దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ,స్థానంలో భారతీయ న్యాయసంహిత బీఎన్‌ఎస్,క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్ (సీఆర్‌పిసి), స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బీఎన్‌ఎస్‌ఎస్,ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ ) స్థానంలో భారతీయ సాక్ష అధినియం బీఎస్‌ఏ, రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే వీటిపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా,మరోవైపు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది.ఇప్పటికే అనేక దశలుగా పోలీస్‌లకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు.

New Laws In The Country From Today, BNSS, Indian Evidence Act , Indian Penal Cod

కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేశారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయవిచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

కొత్త చట్టాల ప్రకారం 1.బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూని కేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు.దీంతో వేగవంతంగా చర్యలు తీసుకొనే వెసులుబాటు పోలీసులకు లభిస్తుంది.2.జీరో ఎఫ్‌ఐఆర్ ప్రకా రం ఏ వ్యక్తి అయినా పోలీస్‌స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లోనైనా ఫిర్యా దు చేయొచ్చు.ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తేవాలి.3.అరెస్ట్ సందర్భాలలో బాధితుడు సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది.తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందడానికి వీలవుతుంది.4.అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌ తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు.తద్వారా అరెస్టుకు సంబంధించిన ముఖ్య మైన సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది.5.హేయమైన నేరాల్లో ఇకనుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి.

Advertisement

ఏడేళ్లకు పైగా శిక్షపడే అవకాశం ఉన్న నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు.ఆ సమయంలో వీడియో గ్రఫీ తప్పనిసరి.దీనివల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.6.మహిళలు,చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు.

ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి.అంతేకాదు బాధిత మహిళలు,చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి.

Advertisement

Latest Nalgonda News