సాధారణంగా చాలా మందికి సిల్కీ హెయిర్( Silky hair ) అంటే ఎంతో ఇష్టం.ఆ ఇష్టంతోనే జుట్టును సిల్కీగా మార్చుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తుంటారు.
ఖరీదైన షాంపూ, ఆయిల్, కండిషనర్స్ ను వాడుతుంటారు.కొందరు కురులను సిల్కీగా మార్చడానికి హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగిస్తుంటారు.
ఈ టూల్స్ వల్ల జుట్టు ఆరోగ్యం తీవ్రంగా పాడవుతుంది.కాబట్టే సహజంగా జుట్టును సిల్కీగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.
<img src="“/>
అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీతో పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax seeds ), వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేస్తూ ఉడికించాలి.

జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి.ఇప్పుడు ఉడికించిన మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఆపై మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన ఒక అరటి పండును వేసుకోవాలి.
అలాగే తయారు చేసి పెట్టుకున్న జెల్ తో పాటు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె( coconut oil ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు సహజంగానే సిల్కీగా, షైనీ గా మారుతుంది.
కాబట్టి సహజంగానే సిల్కీ హెయిర్ ను పొందాలని కోరుకునేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.
చిట్లిన జుట్టు సైతం రిపేర్ అవుతుంది.