ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి : జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు,కార్యకర్తలు,పౌరులు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అనుమతులు లేకుండా ఎవరూ ర్యాలీలు,సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు.

నామినేషన్ల కేంద్రాలు నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశామన్నారు.ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేస్తామని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం కేసులు తప్పవన్నారు.

Must Follow Election Rules District SP Rahul Hegde, Election Rules,District SP

ఎన్నికల కేసులు ఒకసారి నమోదైతే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని గుర్తు చేశారు.

పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!
Advertisement

Latest Suryapet News